చమ్కీలు ............ మొలకెత్తిన మొలకలు మెడలు వంచి నాయి వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నాయి రైతన్నకు నిదుర లేదు మొలకలకు జీవం రాదు ......... బడి బయట బాల్యం బరువును మోస్తున్నది విద్యా శాఖ నిద్రపోతున్నది కాకి లెక్కల కోలాటం రంగస్థలం మీద నాట్యం చేస్తున్నది భారతదేశ భవిష్యత్తు బలి పీఠం వైపు నడుస్తున్నది. ......... ప్రభుత్వ పథకాలకు దళారుల చెదలు పట్టింది అభ్యర్థుల దరఖాస్తులకు బూజు పట్టింది సామాన్యుని బ్రతుకు ఏటి లోని మధ్య నావా ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 9441333315


కామెంట్‌లు