సూర్యమాల..... తల్లి తండ్రి విడుచు తనయు లంత/ కాల నాగు లైన కాల యములు/ భక్తి తోడ కొలువ ముక్తి కలుగు/ పుండలీకు మాట పూలబాట/ ఇంటి పనులు యన్ని ఆలి జేయ/ కట్ట లేము విలువ కాంత పనుల/ కష్ట బెట్ట బోకు కాంత మదిని/ పుండలీకు మాట పూలబాట/ ఆడ బిడ్డ నంటు యాద రించు/ వారు ఆస్తి లోన వాట నివ్వ/ మనసు రాదు నిట్టి మమత కల్ల/ పుండలీకు మాట పూలబాట/ అన్న దమ్ము లనగ యత్మ బంధము/ ఆలి వచ్చి నపుడు అంత రించు/ లోక మంత తెలసు లోని గుట్టు/ పుండలీకు మాట పూలబాట/ ఆడ దంటె అబల యనగ రాదు/ ఆది శక్తి యగును ఆడవాళ్లు/ కన్న తల్లి యబల కాదు నెపుడు/ పుండలీకు మాట పూలబాట/ ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా నిర్మల్ జిల్లా 9441333315


కామెంట్‌లు