సహజీవనం - బాలల నీతి కథ---ఒక ఊరిలో పెద్ద వేప చెట్టు ఉండేది.ఎల్లప్పుడూ పెద్ద ,పెద్ద కొమ్మలతో ,పచ్చని ఆకులతో చక్కగా గాలికి ఆనందంగా ఊగుతూ ఉండేది. అనేక పక్షులు ,కీటకాలు , చీమలకు ఆ చెట్టు ఆవాసం అయ్యింది.పక్షులన్ని గూడులు కట్టుకుని గ్రుడ్లుపెట్టి పొదిగి పిల్లలను చేసేవి.తేనేటీగలు తేనె పట్టు కట్టేవి.చీమలు తొర్రలు చేసుకుని జీవించేవి.పిల్లలు ఊయల కట్టుకుని ఊగేవారు.ఇలా ఆ వేప చెట్టు అందరికి ఆవాసాన్ని ,ఆనందాన్ని కల్గిస్తూ ఉండేది. ఆ చెట్టు పైన ఉన్న జీవులన్ని కలసి సహజీవనంతో ఐకమత్యం గా ఉండసాగాయి. ఒకరోజు ఆ వేప చెట్టుకు ఒక దుర్భుద్ది కలిగింది.తన రెమ్మలు,కొమ్మలు ఉండటం వలనే కదా ఇవన్ని ఇంత సంతోషంగా ఉండకలుగు తున్నాయి అని ఈర్ష్య పెంచుకుంది. ఎలాగైనా వీటినన్నిటిని తరిమేయాలని పధకం వేసింది. అటుగా గొడ్డలి పట్టుకు వెళుతున్న వీరయ్యను పిలిచి 'నీకు వంటకు కట్టెలు కావాలన్నావు కదా నా కొమ్మలన్ని నరుక్కుని పో ' అని చెప్పింది. అసలే కరువు కాలం కావడంతో వీరయ్య తన పంట పండిందని మురిసిపోతూ గొడ్డలితో కొమ్మలన్ని నరుక్కుని వెళ్ళాడు.కొమ్మలు లేక పోవడంతో జీవులన్ని రావడం మానుకున్నాయి.దాంతో చెట్టు ఆనంద పడింది. ఆ ఆనందం ఎంతో కాలం నిలవ లేదు. మోడుగా ఉన్న చెట్టును చూసి వీరయ్యకు అత్యాశ కలిగింది. చెట్టును మొత్తం కొట్టేస్తే తను కొత్తగా కడుతున్న ఇంటికి కర్రలుగా ఉపయోగ పడ తాయని గొడ్డలితో వచ్చాడు.అది చూసి చెట్టు కలవర పడింది.తనని చంపొద్దని ప్రాధేయ పడింది.అయినా వీరయ్య జాలి చూపలేదు. అటుగా వెళు తున్న తేనెటీగలు ఇన్నాళ్ళు మనకు ఆవాసాన్ని ఇచ్చిన చెట్టు అపాాయంలోో ఉందని గ్రహించిి వెంటనే వీరయ్యపై దాడి చేసి తరిమేసాయి.జీవులన్నిటిపై తను ఈర్ష్యపడి వాటిని తరిమేయడం వలనే తనకీ దుస్థితి కల్గిందని చెట్టు ఆవేదన చెంది పశ్చాతాప పడింది. వర్షాకాలం రాగానే చెట్టుబాగా కొమ్మలు చిగురించాయి.వెంటనే చెట్టు జీవులన్నిటిని పిలిచి తనతో ఉండమని కోరింది.అందరం కలసి సహ జీవనం సాగిద్దామని వేడుకుంది. జీవులన్ని సంతోషంగా యధావిదిగా గూడులు కట్టుకున్నాయి.తేనె టీగలు తేనె పట్టు ,చీమలు పుట్టలు పెట్టుకున్నాయి. అందరూ కలసి హాయిగా ఏ ఆపద లేకుండాసహజీవనం సాగించారు.నీతి -కలసి ఉంటే కలదు సుఖం---కయ్యూరు బాలసుబ్రమణ్యం 9441791239 -శ్రీకాళహస్తి


కామెంట్‌లు