మంది లేరు మార్బలం లేదు పోనీ టైల్ యావ లేదు మ్యాచింగ్ చీర, దానికి తగ్గట్టు బ్లౌజ్ వేసుకోవాలనే తపన లేదు ఫీటు మందం మేకప్ లేదు రిబ్బన్ కట్ చేయాలన్న కోరిక లేదు పూలు చల్లించుకోవాలన్న తీరిక లేదు నాలుగు ప్యాకెట్లు పంచి పోస్ట్ లు పెట్టే లేకి తనం లేదు మరేముంది అంటే... అడవి బిడ్డలను ఆదుకోవాలనే తపన ఉంది అన్నార్థులకు ఆప్యాయత పంచే అమ్మతనం ఉంది ఎర్రటి ఎండల్లో, మొనదేలిన రాళ్ళ దారుల్లో నడిచే సాహసం ఉంది సమ్మక్క, సారలక్కల ధీరత్వం ఉంది అన్నింటికీ మించి సీతక్క ఉంది ఏ కష్టంలోనైనా ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది అదే ఆ అడవి బిడ్డలకు ఆదెరువుగా కడుపు నింపుతోంది.. ... బుగ్గ కార్లు, ఎన్ 97 మాస్కులు వేసుకుని " కరోనా" ఫోజు కొట్టే నాయకులకు, జుట్టు చెదరకుండా, గాగూల్స్ తీయకుండా సేవ చేసే నాయకురాళ్లు మిమ్మల్ని చూసి కొంతయినా బుద్ది తెచ్చుకోవాలని కోరుకుంటూ.. .. ఎనబోతుల భాస్కర్


కామెంట్‌లు