*కరోనా* గూర్చి వర్ణమాల తో *అ* క్కడెక్కడో పుట్టింది *ఆ* పదలో పడేసింది *ఇ* టలీకి వెళ్ళింది *ఈ* జిప్టుకు పాకింది *ఉ* ధృతంగా పెరిగింది *ఊ* చకోత కోస్తోంది *ఋ* క్కులకే లొంగనంది *ఎ* ప్పుడు వస్తానో చెప్పనంది *ఏ* డిపించుకుతింటోంది *ఐ* శ్వర్యానికి లొంగనంది *ఒ* క్కోదేశానికి అంటుతోంది *ఓ* డలు విమానాలను ఆపేయించింది *ఔ* షధాలే లేవంది *అం* దరికీ వ్యాపిస్తోంది *అః* కఃనః అన్నట్లుంది (అర్థం కానట్టు ఉంది) *క* రోనా తన పేరందిి *ఖ* నిత్రం లా దిగుతోంది (ఖనిత్రం అంటే గునపం' పలుగు) *గ* రిష్ఠంగా పెరుగుతోంది *ఘ* నుడుసామాన్యుడని చూడనంది *ఙ* వలే తెలియనంది *చ* టుక్కునఅంటుకుంటుంది *ఛ* రఖాలా తిరుగుతోంది *జ* బ్బుల్లో పెద్దదయింది *ఝం* డా ఎగరేస్తోంది *ఞ*! ఆ! యా! అని వెక్కిరిస్తోంది *ట* క్కుడెక్కులు చూపిస్తోంది *ఠ* క్కున అంటుకుంటుంది *డ* బ్బులకు లొంగనంది *ఢ* మరుకం మోగిస్తోంది *ణ* లా బుద్ది వంకరది *త* నకు ఎదురు లేదంటోంది *థ* థమనాన్ని వేగంగా పాడు చేస్తానంది *ద* య్యంలా పీడిస్తోంది *ధ* ర్మం న్యాయం తనకు లేవంది *న* లుగురు కలిస్తే ఓర్వలేక పోతోంది *ప* రుగులు పెట్టిస్తోంది *ఫ* లితం లేదంటోంది *బ* డులు గుడులు మూయించింది *భ* యాన్ని ఇంకా పెంచుతోంది *మ* రణమృదంగం మోగిస్తోంది *య* ముని దగ్గరకు పంపిస్తోంది *ర* క్కసి లా తినేస్తోంది *ల* క్షలమందిని కబలిస్తోంది *వ* రదలా ముంచేస్తోంది *శ* నిలా దాపురించింది *ష* ట్కాలాల్లో కూడా తానుంటానంది( ఆరుకాలాలు బ్రహ్మముహూర్తం ,ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి) *స* బ్బునురగంటే భయమంటుంది *హ* రించుటే తన గుణమంది *ళ* ఇలా అంటూ అంటుకుంటోంది('ళ' ను అల అని చదువుతుంటారు అందుకే అలా సరదాగా రాశా) *క్ష* మించడం తన డిక్షనరీ లో లేదంది ఱంపము లా కోసేస్తోంది. సేకరణ
Popular posts
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి