జీవితానికి సార్థకత అనేది లక్ష్యాన్ని సాధించినపుడే కలుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించడానికి నిర్ధిష్టమైన ప్రణాళిక వేసుకుని పట్టుదలతో శ్రమిస్తే విజయం దాసోహమవుతుంది.ప్రతిఒక్కరూ ఒకసారి తమను తాము ప్రశ్నించుకుని ఈ సమాజానికి మిమ్మల్ని మీరు ఎలా పరిచయం చేసుకోవాలో నిర్ణయించుకోవాలి.ఇప్పటివరకు ఒక లక్ష్య మంటూ లేకుండా కాలం వృధా చేసారా? ఈ క్షణమైనా కనువిప్పు చేసుకుని మీకంటూ సమాజంలో ఒక స్థానం కేటాయించుకోవడానికి ఉపక్రమించండి.మీలో ఉన్న ప్రతికూల అంశాలను,బలహీనతలను మొదట జయిస్తే సగం విజయం వరించినట్టే...అంటున్నారు డాక్టర్ భాగ్యలక్ష్మి గంజి గారు మరి మీరు వినండి


కామెంట్‌లు