మా పాఠశాలకు కావలసిన గదుల నిర్మాణానికి కాంట్రాక్టర్ కు, ఆర్డర్స్ ఇచ్చారు జిల్లాపరిషత్ వారు. అలానే స్కూలుకు కావలసిన సైన్స్ ఏపరేటస్ 'A' గ్రేడ్ లిస్టు ప్రకారమే ఇచ్చారు. పాఠశాల ప్రక్కనే ఉన్న చెరువును బహిర్భూమిగా వినియో గించే వారని చెప్పాను. పాఠశాలను,ఆ చెరువును సపరేట్ చేస్తూ మధ్యలో గోడ కట్టారు.అంతేకాదు ఆ చెరువు చుట్టూ ఉన్న తుప్పలు, డొంకలు కొట్టించేసి ఆ పరిసరప్రాంతాలను బహిర్భూమిగా వాడకుండా కట్టుదిట్టం చేసారు. అయినా పాఠశాల పని గంటల అనంతరం అందరూ వెళ్లిపోయిన తరువాత ఏవో దుర్గంధపూరితమైన చెత్తా చెదారాలను తరగతి గది కిటికీ తలుపులుగుండా లోన తెచ్చిపడేసేవారు. కానీ రోజూ ఇదే సమస్య .తరగతి పిల్లలను వరండాలో కూర్చోపెట్టి తరగతులను టీీచర్లు నిర్వహించేవారు. రోజూ ఎవరికో డబ్బులిచ్చి క్లీన్ చేయించేవాడిని. టీచర్స్, పిల్లలు టెన్షన్ తో ఫీల్ ఆయ్యేవారు. పాఠశాల గదులకు తాళాలు వేసినా ఒకటి రెండు గదుల కిటికీ తలుపులకు గెడలుండేవి కాదు. దీనిని ఆసరాగా తీసుకుని ఎవరో ఇలా చేేసేవారు. ఈ పనిచేస్తుంది ఎవరో కనుక్కోవాలి అనుకొని ఉదయం ఐదుగురు, సాయంత్రం ఐదుగురు హోస్టల్ పిల్లలనుపాఠశాల గ్రౌండ్లో ఆడుకున్నట్టుగ ఆడుకొని దొంగను పట్ట మన్నాను. హాస్టల్ వార్డెన్ తో మాట్లాడి ఈ విషయంలో పిల్లలను సీక్రెట్ ఏజెంట్లుగా పంపమన్నాను. అలాగే వార్డెన్ కూడా సహకరించారు. వారం రోజులు అయినా ఫలితం లేకపోయింది. ఒకనాడు సైన్స్ లాబ్ కిటికీ తలుపును ఊడబరికి కిటికీ ఊచలు గుండా కర్రను దూర్చి ఒక గాజు పరికరాన్ని బద్దలు కొట్టేసారు. నాతో సహా టీచర్స్ అంతా బాధ పడ్డారు. అందులో సైన్స్ మాష్టారు మరీ బాధ పడ్డారు. ఎందుకంటే సైన్స్ పరికరాలొచ్చి ఇంకా నెల రోజులైనా పూర్తి కాలేదు. ఈ పనిచేస్తున్నది ఎవరో పరిశీలించి కనుక్కోవాలి అని టీచర్సంతా ముక్త ఖంఠంతో పలికారు. ఎవరూ లేన ప్పుడు మా స్కూలుకు సంబంధించిన హోస్టల్ స్టూడెంట్స్ ను పిలిచి సాయంత్రం పాఠశాల లాంగ్ బెల్ అయిన తరువాత పాఠశాల గ్రౌండ్ లో అందరితో ఆటలు ఆడుతున్నట్టుగా నటించి ఆ గదుల వైపే దృష్టంతా బెట్టమన్నాను. అయితే ఈసారి గూఢచర్యం పథకం మార్చాం. నా ఆఫీసురూం తరువాత ఈ గదులు ఉండేవి. ఈ గదులకు ఆపోజిట్ సైడ్ న కొంత దూరంలో పాఠశాల ఆడిటోరియం ఉండేది. అక్కడ ఒక ముగ్గురిని కూర్చోమని మిగిలినవారిని ఆడుతు న్నట్టు నటించమన్నాను. వారి దృష్టంతా దొంగపైనే ఉంచమన్నాను. అలాగే సీక్రెట్ ఏజెంట్స్ లా పనిచేసి దొంగ గదిలో దూరుతుండగా పట్టుకున్నారు. ఆ ఊరులో ఉన్న మా స్కూల్ టీచర్స్ వద్దకు ఆ సాయంత్రం హాస్టల్ పిల్లలు తీసుకువెళ్లి అప్పజెప్పారు. మరుచటి దినం పాఠశాలకు నేను వచ్చిన వెంటనే మా సీక్రెట్ ఏజెంట్స్, టీచర్స్ నాదగ్గరకొచ్చిదొంగదొరికాడు అని సంబరపడి చెప్పారు. ఆ కుర్రాడిని తీసుకురమ్మనమన్నాను. కానీ ఆ అబ్బాయి పాఠశాలకురాలేదు. వాళ్ళ ఇంటికి ఇద్దరు విద్యార్థులను పంపించి ఆ అబ్బాయిని, వాళ్ళ నాన్నను తీసుకు రమ్మనమన్నాను. తండ్రి తన కొడుకును తీసుకు వచ్చాడు. ఆ అబ్బాయిని చూస్తే ' రాముడు మంచి బాలుడు' అన్నట్టు కనిపించాడు.విద్యార్థిని పట్టుకున్న స్టూడెంట్సును, ముగ్గురు సీనియర్ టీచర్స్ ను పిలిపించి కుర్రవాడి తండ్రి ముందే ఈవారం, పదిరోజులుగా ఆ అబ్బాయి ఏమేం పనులు చేసాడో ఈ విద్యార్థులు, టీచర్స్ చే చెప్పించాను. అందుకు ఆ తండ్రి మా అబ్బాయి అటువంటివాడు కాదండి. చాలఅమాయకుడండీ అన్నాడు. " మీ అబ్బాయి ఎటువంటి వాడో మీ అబ్బాయే చెబుతాడు వాడి నోటి వెంబడే వినండి " అన్నాను. కానీ ఆ అబ్బాయి కనీసం నోరు విప్పకుండా ముఖం దించేసాడు. వాళ్ళందరూ చెప్పినవి నిజమేనా అని తండ్రి అడిగాడు. అందుకేనా స్కూలుకు ఉదయం రాలేదు అన్నాడు. సమాధానం చెప్పకుండా ఏడవడం మొదలు పెట్టాడు. జరిగిన విషయాన్నంతా ఒక కాగితం పై ఆ అబ్బాయిని వ్రాసిమ్మన్నాను. టీచర్స్ ఆ అబ్బాయిని, తండ్రిని సైన్స్ లాబ్ కు తీసుకువెళ్లి పగుల గొట్టిన గాజు పరికరాలను చూపించారు. ఇతర గదులకు తీసుకు ఆ అబ్బాయి చేసిన ఘనకార్యాలన్నీ తెలియ జెప్పిన తరువాత వాళ్ళ అబ్బాయి తప్పును క్షమించ మన్నాడు. జరిగినదంతా వ్రాసి ఇచ్చి క్షమించమని కోరారు తండ్రి కొడుకులు." మీ అబ్బాయి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ వయస్సులోనే ఇటువంటి పనులు చేస్తే ఇటు తల్లిదండ్రులకు పాఠశాలకు చెడ్డపేరు. పది రోజులుగా పిల్లలకు చదువులు లేవు. పిల్లలు, టీచర్స్ మానసికంగా చాలా బాధ పడ్డాం. మేం పోలీసు స్టేషన్ కు కంప్లైంట్ ఇద్దామనుకొనేలాగానే మీ వాడు పట్టుబడ్డాడు. ఇప్పుడు ఏం చేయమంటావు ? అని చెబుతూ టీ . సీ తీసుకు వెళ్లిపోమన్నాను. తండ్రిగా తను బ్రతిమలాడాడు. అయినా అటువంటి క్రమశిక్షణారాహిత్యంతో కూడుకున్నఅబ్బాయిని స్కూలులో ఉంచదలచుకోలేదని టీ.సీ ( ట్రాన్ఫర్ సర్టిఫికెట్ ) తీసుకోమని చెప్పాను. ఆ అబ్బాయితండ్రి దగ్గర రిక్వెస్ట్ లెటర్ తీసుకుని టీ .సీ ఇచ్చేసాను. అప్పటి నుండి క్రమశిక్షణారాహిత్యంతో ప్రవర్తిస్తే ఏమవు తుందో తెలిసి వచ్చింది. ( సశేషం )-శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.


కామెంట్‌లు