మార్క్స్ జన్మదినం సందర్భంగా నాది ఒక చిరు జ్ఞాపకం.- విరించి లక్ష్మి -.మా ఇంట్లో నాకు ఊహ తెలిసేప్పటికి గోడమీద బిగించిన చెక్క మీద చల్లపల్లి నారాయణరావు గారి నిలువెత్తు ఫొటో...దానికి ఇరువైపులా కామ్రెడ్ చింతపల్లి పాపారావు, రామారావు అనే పేర్లతో చిన్న ఫొటోలు వుండేవి...వారు ముగ్గురూ కూడా పోలీస్ కాల్పుల్లో మరణించిన వారే...వారిలో ఒకరైన పాపారావు పేరు మా చిన్నన్నయ్యకు పెట్టారు..ఆయన మరణించినప్పుడే పుట్టినందున...ఇంట్లో వున్న పుస్తకాల మీద మార్క్స్,,ఏంగిల్స్, లెనిన్,స్టాలిన్ ,మావో ఫొటోలు వుండేవి..నాకు చదువు రాని వయసు నుంచే ఆ ఫొటోలను చూస్తూ వారి గురించి వింటూ పెరిగాను...ఐతే ఇప్పటికీ వారెవరినీ నేను చదవలేదు.నాకు ఇప్పటికీ దాస్ కాపిటల్ గురించి, మార్క్స్ సిద్దాంతం గురించీ నిజంగా తెలియదు..పురాణాల గురించి విన్న జ్ఞానంతో ఎలా వ్యాఖ్యానిస్తామో అలానే నేను చిన్నప్పటి నుంచి విన్న జ్ఞానమే తప్ప చదివిన పరిజ్ఞానం లేని దాన్ని...అందుకే నేను ఏ చర్చల్లో పాల్గొనలేను......మా పెద్దన్నయ్య గొప్ప ఫిలాసఫర్, ఒక విజ్ఞానగని, జ్ఞాన భాండాగారం... దాన్ని అందుకోవడం నా శక్తికి మించిన పని.... అసలు విషయానికి వస్తే....మా చిన్నప్పుడు తాటికాయలు కాల్చుకుని తినేవాళ్లం...దాని బుర్ర,లేక గింజ ఎంత తిన్నా రసం వస్తూనే వుండేది...అలా తింటుండగా నాకో ఆలోచన వచ్చింది నా ఫిప్త్ క్లాస్ లో...ఆబుర్ర మద్యలో కొంత సవరగాచేసి చుట్టూ పీచు వుంచి దాన్ని శుబ్బరంగా కడిగి ఎండబెట్టి, మార్క్స్ తలను తయారు చేశాను...అచ్చం మార్క్స్ లానే...అప్పట్లో మా పెద్దన్నయ్య కండిషన్ బెయిల్ మీద ఇంట్లో వుండే వారు.మా చిన్నన్నయ్య ట్యూషన్ లు చెప్పుకుంటూ వుండేవారు.....నేను తయారు చేసిన బొమ్మను చూసి మా చిన్నన్నయ్య ఎంతో మెచ్చుకుని దానికి మెరుగులు ఎలా దిద్దాలో చెప్పి, మిగతా బుర్రలతో ఏంగెల్స్ ని చేయమని ప్రోత్సహించారు.పైగా ఎప్పుడూ చదువుకుంటూనే వుండే మా పెద్దన్నయకు నా సృజనాత్మకత చూపించి మరింత నన్ను ప్రోత్సహించాలనుకున్నారు....కానీ మా పెగ్దన్నయ్య దాన్ని విసిరి పారేసి చీకిన తాటి బుర్ర మీద మార్క్స్ ను తయారు చేస్తావా అనిఅరిచారు.... నేను వెంటనే ఐతే మంచి తాటికాయ కడిగి అలా చేస్తాను అన్నయ్యా అన్నాను సంతోషంగా కానీ మా అన్నయ్య దాని కీ ఒప్పుకోలేదు...అలా తయారు చేయవద్దు తాటి బుర్రలతో అని చెప్పారు...నేను మళ్లీ ఆ ప్రయత్నం చెయ్యలేదు...అంతే కాదు నాకెంతో ఇష్టమైన తాటికాయను కూడా తర్వాతి రోజుల్లో తినటం తగ్గించాను.. ఎందుకంటే నేను తిన్న ప్రతిసారి మార్క్స్ గుర్తు వస్తాడు అసంకల్పితంగా తయారై పోతాడు.. కానీ ఆ సంఘటన నాకన్నా మా చిన్నన్నయ్యను చాలా బాధపెట్టింది.....ఆయన ఆరోజు మ్లానమైన మొహం ఇప్పటికీ నాకు గుర్తు వుంది... అలా ఎందుకు జరిగింది! అని ఇప్పుడు ఆలోచిస్తేమా చిన్నన్నయ్య కళాకారుడు, చిన్నచిన్న నాటకాలు,పాటలు డైరెక్ట్ చేసేవాడు. ఆయన ప్రతిదానిలో కళను వెతుక్కునే వారు. సృజనాత్మకత కు విలువిచ్చేవారు,ప్రోత్సహించే వారు...మా పెద్దన్నయ్య ఆయన ఫాలో అయ్యేవారిని చాలా గౌరవంగా తప్ప మరో విధంగా చూడరు ....అందుకే టీచర్కి, కార్యనిర్వహకునికి వున్న కళాత్మకత ఫిలాసఫర్లకు,సిద్దాంత కర్తలకు వుండదు...అని గ్రహించడమై నది.....ఈ ఫొటో చూస్తే నాకు నా తాటి బుర్ర మార్క్స్ కనిపించాడు...అందుకే మీతో పంచుకున్నా...


కామెంట్‌లు