భగవాన్ - సర్పము-----తిరువణ్ణామలైలో కొండమీద స్కంధాశ్రమం ఉంది. అక్కడికి ఓరోజు ఓ పాము వచ్చింది. ఆ పాముని చూడటంతోనే భగవాన్ రమణమహర్షి తల్లి ఎంతో భయపడ్డారు. కానీ భగవాన్ శాంతంగా ఆ పాము దగ్గరకు వెళ్ళారు. ఆయన దగ్గరకు వచ్చేకొద్దీ పాము వెనక్కుపోతూ రెండు రాళ్ళ మధ్య ఆగింది. భగవాన్ పాముని చూశారు. ఉన్నట్లుండి పాము వెనుతిరిగి చుట్ట చుట్టుకుని పడగ ఎత్తి భగవాన్ నే చూడసాగింది.భగవాన్ కూడా పాము వంకే తదేకంగా చూసారు.కొంతసేపు ఇలానే చూపులుసాగాయి.భగవాన్ మీద నమ్మకం కలిగిన పాము ఆయన వద్దకు వచ్చింది. భగవాన్ తాకే వరకే అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఈ పాము ఆ తర్వాతకూడా చాలా సార్లు భగవాన్ దర్శనంకోసం వచ్చిపోతుండేది. కొన్నిసార్లయితే భగవాన్ మీదకు ఎక్కే ప్రయత్నం చేసేది. ఇదిలా ఉండగా ఈ ఆశ్రమంలోనే రెండు నేమళ్ళుండేవి. సహజంగా అయితే పాముకీ నెమలికీ పడదుఖమగా. కానీ ఆశ్రమ నెమళ్ళు రెండూ పాముని ఏమీ చేసేవి కావు. పైగా నెమళ్ళు నృత్యం చేస్తుండగా పాము పడగ విప్పి నర్తించేదని భగవాన్ చెప్తుండేవారు. ఆ రెండు నెమళ్ళలో ఒకటి చనిపోగా భగవాన్ దానిని ఖననం చేసి సమాధి కట్టి దానిపై శివలింగం స్థాపించారు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు