మానేరు ము చ్చట్లు- రామ్మోహన్ రావు తుమ్మూరి :-ఇదంతా ఎందుకు రాస్తున్నాను అని నన్నునేను ప్రశ్నించుకున్నా నొక్కసారి. కేవలం నా అనుభవాలు మీతో పంచు కోవాలనా?.....కాదు అని నా లోపల్నుండి అని జవాబు వచ్చింది.మరయితే ఏమిటి?ఒకప్పటి జీవన విధానం ఎలా ఉండేది.మారు మూల పల్లెటూరయినా ఏ ఆధునిక సౌకర్యాలు లేకపోయినా, భిన్న జాతులు,భిన్న మతాలు,భిన్న వర్గాలు ఎలా సమన్వయంతో తల్లి మెలసి సహజీవనం చేయగలిగారు?ఏ టీవీలు లేవు.ఏ మత ప్రవక్తల ప్రవచనాలు బోధలు లేవు,ఏ కాన్వెంటు స్కూళ్లు లేవు.అయినా ప్రజలు కలిసి మెలిసి ఉన్నారు.ఎవరి పని వారు నిష్టతో చేసుకున్నారు.ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఏనాడూ ఆశపడలేదు,మందుల పంటలు లేవు.ఆనాటి ప్రభుత్వ పాఠ శాలలో చదివిన వారే ఎందరో ఇంజనీ యర్లు,డాక్టర్లు,లెక్చరర్లు,టీచర్లు,ఇంకా మరెన్నో ఉద్యోగులుగా ఎదిగినారు.కాళ్లకు చెప్పల్లేని వారెందరో,ఒంటిమీద ఒక అంగీ లాగు,దండెం మీద మరొకటి మాత్రమే ఉన్నవారెందరో.మక్కజొన్న గటక,చింతకాయ తొక్కుతో కడుపు నింపుకున్న వారెందరో.పచ్చిపులుసుతో పదిమందిని పెంచిన తల్లులెందరో.మైళ్ల దూరం నడచి వచ్చి చదువుకున్న పేద విద్యార్థులెందరో.అప్పుడు ఈ మధ్యాహ్న పథకాలు లేవు.ఉచిత పుస్తకాల పంపిణీ లేదు.కేవలం పూర్ ఫండ్ బుక్స్.ఒకపుస్తకం నలుగురు చదివారు.స్కాలర్ షిప్పులు మెరిట్ స్టుడెంట్స్ కే.కష్టపడి చదివిన వారు పై చదువులు చదివి ఉద్యోగస్థుల య్యారు.చదువలేని వారు మంచి రైతులయ్యారు,వృత్తి కళాకారులయ్యారు.ఒక పోస్టుకు స్పందిస్తూ ఫేస్ బుక్ మిత్రుడొకాయన అన్న మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. ‘లక్ష్మిరాజం సారున్నన్ని రోజులు పరీక్షల సమయంలో ఏనాడూ స్క్వాడ్ రాలేదని’ అంటే ఒక ప్రధానోపాధ్యాయుని మీద ఎంత భరోసా’ నాకిప్పటికీ తలచుకుంటే నవ్వొస్తుంది నేను కరీంనగర్లో H.S.C.పరీక్ష రాసినప్పుడు భయం భయంగా పరీక్ష రాయడానికి వెళ్లాము.ఇన్విజిలేటరు మామూలుగానే అన్నాడూ ఎవరూ తలకాయ తిప్పొద్దు.తలకాయ తిప్పితేపేపరు గుంజుకుని బయటకు పంపిస్తా అంటే భయపడి తలతిప్పక రాస్తే మెడనొప్పి పట్టుకున్నది.అది అమా యకత్వమే కావచ్చు .కాని అంత భయంతో పరీక్షలు రాసేవారు.ఏ పత్రికల వాళ్ల ప్రమేయముండేది కాదు.అప్పుడు ఈ స్పాట్ వ్యాల్యుసేషన్లు లేవు. ఉపా ధ్యాయుల ఇండ్లకే పేపర్లు వెళ్లేవి. ఉపాధ్యాయుల మీద ఎంత నమ్మకం. ఇన్ని రకాల ఫథకాలు లేవు.రాయితీలులేవు.ఋణాలు లేవు.ఉన్నా మాఫీలోన లేవు.కష్టపడనిదే కడుపు నిండదనే ఏకైక సిద్ధాంతం చలామణిలో ఉన్న రోజులు.నేను పై అన్నింటిలో నూ అక్కడక్కడా కొన్ని మినహాయింపు వింటేఉండవచ్చు గానీ అత్యధిక శాతం మను షులు మనుషులుగా ఉన్న రోజులవి.నాకైతే మా ఊరంతా బడే.కేవలం అక్షర విద్య మాత్రమే టీచర్ల బడిలో. మిగతా ఎన్నో విషయాలు ఊరు నేర్పింది.మానేరు నేర్పింది. నాకు చాలా సంతోషకరమైన విషయ మేమిటంటే ఎందరో నా పోస్టింగులుహ చదివి ఇష్ట పడటం,స్పందించడం. అందరికీ నా వందనాలు. వాకిష్టమయిన ప్రదేశాల గురించి చెబుదామనుకొని ఏదో ఆవేశం పూనిపై మాటలు రాసే వరకే నిద్ర వచ్చింది.పొద్దున్నే లేచి రాద్దామనుకుని రాసిన దగ్గరికి పోస్ట్ చేసి పడుకున్నాను అయితే నిన్న గానుగ గురించి చెప్పాను కదా.అలాగే ఓసారి పని మీద కుమ్మరి బాలరాజు ఇంటికి వెళ్లటం జరిగింది.మంచి నీళ్ల కాలువకు పొయ్యేతొవ్వలో కుమ్మరి వాడ ఉంది.అదివరకు ఒకటి రెండు సార్లు తొవ్వలో ఉన్న కుమ్మరించ వాకిట్లో కర్రతో ఆరె తిప్పుతూదాని మధ్యలో మొత్తంగా కలిపిన మట్టిముద్దను నైపుణ్యంతో కుండగానో కూజాగానో మలుస్తుంటే,ఏదో తెలియని ఆనందం అనుభవించిన యాది ఇప్పటికీ పచ్చి మట్టంత పదిలంగా ఉంది.బాలరాజు వాళ్ల వాకిలి చాలా పెద్దది.వాకిట్లో ఒకవైపు ఆరె,మరోవైపుఆరబెట్టిన మృణ్మయ పాత్రలు,ఇంకో వైపు ఎండిన ఎర్రని కుండలు,అక్కడక్కడా కుండల తెల్లగా నల్లగా అంటుకునిఉన్న బూడిద,మరోవైపు ఎర్రని పుట్టమట్టి ,ఓ పక్క గడ్డివాము ఎడ్ల కొట్టము అన్నీ చూస్తున్నాను.ఆయన ప్రక్కనే ఉన్న ఆవంలో కిందంతా గడ్డి పరచి దానిమీద ఆరబెట్టిన కుండలుఒకదాని మీద మరొకటి బోర్లిస్తూ జాగ్రత్తగా సర్దుతున్నారు. ఆవము (Kiln) లేదాబట్టీ అర్ధ చంద్రాకారంలో కట్టబడిన మట్టి గోడ.అది కీరీటంలాగా కొసల వద్ద తక్కువ ఎత్తు కలిగి మధ్యలో ఎక్కువ ఎత్తుండే ఆకారం.మధ్యలో క్రిందివైపు రెండు గుళ్లు మంట పెట్టడానికి ఉంటాయి.కుండలన్నీ పేర్చిన తరువాతదానిపై గడ్డి కప్పి ఆపైన పచ్చి మట్టి పూతతో పూర్తిగ ఆవం మూత వేసి క్రిందిగూళ్లనుండి మంట పెడితే ఆ లోపలి కాకకు కుండలన్నీ మాగబెట్టిన మామిడి పండ్లలా నిగనిగలాడుతాయి.వేడి చల్లారిన తరువాత కుండలు బయటికి తీస్తారు.ఎంత ఒనరు కావాలె.ఇవన్నీ చేయడానికి. ఒక కుండ తయారు కావాలంటే ఎక్కడినుంచో మట్టి బండిలో తెచ్చి ధానిలో ఇసుక రాయి లేకుండా శుభ్రపరచి నీట తడిపి ముద్ద చేసి, ఆరెపై ఆకృతినిచ్చి ఆరబెట్టి కాల్చిన తరువాత అమ్మకానికి పెడితే దానిని నాణ్యతా పరీక్ష చేయడానికి కుడిచేత మధ్య వేలును వెనుకకు మడిచి కుండపై కొడితే ఆశబ్దం ఖంగుమని మోగితే అది మంచిదన్నట్లు.ఇంత తతంగం ఉంటుంది ఒక కుండ తయారీ వెనుక.వారి శ్రమ చూసిన వారైతే అడ్డగోలుధరకు బేరమాడరు.మన సంప్రదాయంలో కుండలు అభానికీ శుభానికీ అవసరమే.పెళ్లిళ్లలో ఐరేని కుండలు,గరిగ బుడ్లు ,కంచుళ్లు మొదలైనవి ఉంటాయి.నా చిన్నతనంలో చాలా దిగువ మధ్య తరగతి ఇండ్లలో వంటపాత్రలన్నీ మట్టివే చూశాను. మాకు మడి అర్రలో మూడువైపులా కట్టిన చిన్న మట్టి గద్దె మీద కుండల అమరికకు లొందలుండేవి.ఆలొందలలో కుండలు పొందించి పెట్టి ఉండేవి.ఒక వైపు లక్క పూసిన కుండలలో ఆవకాయల కాగులు వాసెన కట్టినవి మిగతావాటిలో రకరకాల దినుసులుండేవి.అప్పట్లో ఈ స్టీలు ప్లాస్టిక్ డబ్బాలుండేవి కావు.కంది పప్పు పెసరపప్పు కారం ఉప్పు శక్కర ఇలా ఒక్కోకుండలో ఒక్కో పదార్థం భద్రపరిచే వారు. కుమ్మరులను బతికించేవారు.నీళ్ల మోత కుండలతోనే.పశువులకు కుడితికి గోలాలు,బోళ్లు కడిగే చోట గోలెం.ఇలా ఊరందరికీ కావలసిన మట్టి పాత్రలుసరఫరా చేయడానికి తగ్గట్టుగా కుమ్మరుల కుటుంబాలుండేవి.ఆ కుటుంబాలలో కాస్త పేరున్న మనిషి కుమ్మరి బాలరాజు.ఊరి పెద్దలలో ఒకరు
Popular posts
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి