భారతదేశం -- (బాలగేయం) దేశం దేశం మనదేశం భారతదేశం మనదేశం సుందరమైనది మనదేశం నందనవనమే మనదేశం పాడిపంటల మనదేశం ప్రకృతి వరమే మనదేశం కొండ కోనల మనదేశం నదుల సంగమం మనదేశం ఘనులకు నిలయం మనదేశం ఘనమైన చరితనే మనదేశం వీరుల త్యాగం మనదేశం ధీరత కలిగిన మనదేశం మమతాసమతల మనదేశం మహనీయమైనది మనదేశం. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు