లేడికూన **************** (బాలగేయం) అనగనగా అనగనగా ఒక అడవి అడవిలోన ఉన్నదొక్క లేడికూన బిక్కుబిక్కు బిక్కుమంటు చూస్తుంది తల్లికోసం అది ఎంతో వెతుకుతుంది ఇంతలోన పెద్దపులి వచ్చింది గాండ్రు గాండ్రు గాండ్రుమంటు దూకింది అయ్యో!పాపం లేడిపిల్ల ఏడ్ఛింది భయపడుతూ భయపడుతూ ఉరికింది అక్కడున్న మేమంతా చూసాము మా చేతిలోని బాణాలు వేసాము మా బాణాలు తాకాయి పెద్దపులికి కుయ్యో!మొర్రో!అనుకుంటు వెళ్ళింది అంతలోనె తల్లిజింక వచ్చింది బిడ్డనెంతొ ముద్దాడి తడిమింది. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు