సాహసబాలలు -- (బాలగేయం) రాము సోము కలిసారు కొండపై గుహకు వెళ్ళారు గుహలో ఉన్నది ఒక ఏరు గలగల పారే సెలయేరు సెలయేటి పక్కన ఒక చెట్టు చెట్టుమీద ఉన్నది ఒక భూతం భూతం భూతం ఇది భూతం అందరిని మింగే పెద్ద భూతం పెద్ద పెద్దగా అరిచింది నోరును తెరిచి వచ్చింది రామూ సోమూ చూసారు ఒరలో కత్తిని తీసారు భూతం మెడపై వేసారు అందరి బాధను తీర్చారు సాహస బాలలు అయ్యారు పెద్దల మెప్పును పొందారు. పద్మ త్రిపురారి జనగామ


కామెంట్‌లు