విస్తుపోయిన నెహ్రూ--తమిళనాడు పర్యటనలో ఉన్న దేశ ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ మధురై సమీపంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కామరాజర్ తో కలిసి కారులో పోతున్నారు.ఉన్నట్లుండి నెహ్రూకి ఓ విషయం గుర్తుకొచ్చింది. మిస్టర్ కామరాజ్! మీ ఊరు ఇటే కదా? ఇంతదూరం ఎలాగూ వచ్చాం....మీ అమ్మగారిని చూసిపోదాం" అన్నారు నెహ్రూ. అయితే కామరాజర్ "మన కోసం ఎదురుచూస్తుంటారు కార్యక్రమ నిర్వాహకులు. ఆలస్యమవుతుందేమో మా పల్లెకు వెళ్తే" అన్నారు నెహ్రూతో.కానీ నెహ్రూ ఆయన మాట వినలేదు. "ఎలాగూ ఇటొచ్చాంకదా....మీ అమ్మగారిని చూసే పోదాం. చూడకుండా వెళ్తే బాగుండదు" అన్నారు నెహ్రూ.ప్రధాని పట్టుబట్టడంతో కామరాజర్ సరేనని డ్రైవరుతో "తమ్ముడూ! కారు కాస్తంత పక్కకు పోనిచ్చి అక్కడ ఆపు" అని ఓ పొలం గట్టు పక్కన ఆపించారు వాహనాన్ని.ఇదేంటి దగ్గర్లో ఒక్క ఇల్లూ కనిపించడం లేదు. పైగా ఓ పొలం పక్కన కారు ఆపించేరేంటి చెప్మా అని మనసులో అనుకున్నారు నెహ్రూ.ఇద్దరూ కారు దిగారు. కొంత దూరంలో పొలంలో కొంతమంది మహిళలు పని చేస్తున్నారు. కామరాజ్ "అమ్మా! ఇదిగో నీ కొడుకొచ్చాను" అన్నారు పెద్ద గొంతెత్తి.పొలంలో పని చేస్తున్న ఓ పెద్దావిడ ఆ మాట విని దగ్గరకు వచ్చారు. కొడుకు కామరాజ్ ని చూడటంతోనే "ఏలా ఉన్నావురా బిడ్డా? అంతా క్షేమమేనా?" అని అడిగింది ఆ తల్లి. "బాగున్నానమ్మా" అంటూ "నిన్ను చూడటానికి మన దేశ ప్రధాని వచ్చారమ్మా" అన్నారు కామరాజర్. తల్లీ కొడుకుల మధ్య జరుగుతున్న మాటల ముచ్చట్లను చూసి విస్తుపోయిన నెహ్రూ "నమస్కారం" అని అనగా ఆవిడకూడా దణ్ణంపెట్టారు.కామరాజర్ తన తల్లి చాలా కాలంగా ఈ పొలం పనులు చేస్తున్నారని వివరించారు."ఔనా" అంటూ అక్కడ కాస్సేపుండి కారెక్కి కార్యక్రమానికి వెళ్ళిపోయారు.(గమనిక ...ఓ తమిళ మిత్రుడు ఈ విషయం తమిళంలో పంపగా అనంవదించాను. కామరాజర్ తమోళనాడు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన మాత్రమే మద్రాసులో ఉండేవొరు.ఆయన తల్లి స్వగ్రామంలో ఉంటూ పొలంపనులు చేస్తూ జీవనం సాగించేవారు. ఆమె ఒంట్లో ఓపిక ఉన్నంత వరకూ పొలం పనులు చేయడం గమనార్హం. కామరాజర్ అతి నిరాడంబరుడు. అవివాహితుడు)- యామిజాల జగదీశ్


కామెంట్‌లు