నమస్కారం, నా పేరు K.K.రాఘవన్, మా తల్లితండ్రులు కన్నన్ గారు , నప్పిన్నాయ్ గారు. నేను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 5 వ తరగతి చదువుతున్నాను. గురుకులంతో నాకు మా కుటుంబానికి ఎంతో చక్కని అనుబంధం ఉన్నది. గురుకులంలో నా సంగీత శిక్షణ,శ్రద్ధగా ఉత్తేజకరమైనదిగా, ఆసక్తికరంగా, సమాచారవంతంగా, అర్ధంచేసుకునే విధంగా ఉంది. నేను ఈ సంగీత విద్య నేర్చుకోవడం వలన నాకు మానసిక పరిపక్వత ఇంకా చదువుల వలన కలిగే వత్తిడి నుండి దూరంగా ఉండే అవకాశం కల్గి ఎంతో ఆనందకరంగా ఉన్నది. గురుకులంలో, HTAMF, సత్సంగ్, ఈవినింగ్ / మార్నింగ్ రాగా వంటి అనేక పండుగలు , సందర్భాలు ఉన్నాయి. HTAMF అనేది మా అందరికి ఒక వైభవమైనటువంటి పండుగ, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోనుండి చాలా మంది గొప్ప సంగీతకారులు కలిసి వచ్చి పంచరత్న కీర్తనలతో పాటు అనేక కీర్తనలు పాడతారు. దీనిని సాధారణంగా హైదరాబాద్ త్యాగరాజా ఆరాధన మ్యూజిక్ ఫెస్టివల్ అని పిలుస్తారు. ఇది హైదరాబాద్ లోని శిల్పారామం యొక్క యాంఫిథియేటర్లో జరుగుతుంది. సత్సంగ్ ఒక చిన్న పండుగ, ఇక్కడ గురుకులం విద్యార్ధులందరూ ఒకచోట చేరి వారి స్థాయికి అనుగుణంగా కొన్ని సంగీత భాగాలను (పాటలు) ప్రదర్శిస్తారు. ఈవినింగ్ అండ్ మార్నింగ్ రాగా అనేది సంగీత విద్వాంసులు వచ్చి అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. ఇవన్నీ గురుకులం , సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ విద్యార్ధుల్నీ మరియు వారి తల్లితండ్రులందరినీ భాగం చేస్తూ ఎంతో విద్యా ,విజ్ఞాన మరియు స్పూర్తిదాయ కంగా ఉంటుంది. త్వరలో మనమందరం గురుకులంలో కలుసుకుందామని ఆశిస్తున్నాను. పై పేరా చదివినందుకు ధన్యవాదములు!


కామెంట్‌లు