రొట్టెలవారికంటే-తుంపులవారేమేలు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. అమరావతి నగర పొలిమేరలలొ సదానందుని ఆశ్రమం ఉంది.అందులొ పలువురు విద్యార్ధులకు భోజన,వసతి తొపాటు విద్యాదానం జరుగుతుంది. ఒక రోజు పాఠాలు ముగిసిన అనంతరం అందరూ భోజనశాలకు బయలుదేరారు.మార్గంలొ శివయ్య అనే శిష్యుడు 'స్వామి రొట్టెలవారికంటే తుంపులవారేమేలు,అంటారుకదా ఎలా?'అన్నాడు. 'సమయం,సందర్బం వచ్చినప్పుడు తప్పక తెలియజేస్తాను'అన్నాడు సదానందుడు. కొద్దిరోజుల అనంతరం ఆశ్రమ నిర్వాహణ నిమిత్తం దాతలను కలవడానిని,ఉదయాన్నే అల్పహారం అనంతరం శివయ్య నితొడుగా తీసుకుని బయలుదేరాడు సదానందుడు. వెళ్లిన పని ముగించుకుని తిరుగు ప్రయాణం సాగించసాగారు.ఆశ్రమానికి చేరువగా వచ్చేసరికి భోజనసమయం లోభగవంతుని నామస్మరణ చేసి, శంఖనాదం చేస్తారు.అదివిన్న సదానందుడు'నాయనా శివయ్య నువ్వుత్వరగా భోజనాని వెళ్లు'అన్నాడు. 'అలాగే గురుదేవా'అన్న శివయ్య వేగంగావెళ్లి ఆశ్రమంలో కాళ్లు చేతులు శుభ్రపరచుని భోజనశాలకు వెళ్లాడు.శివయ్యను చూసినవిద్యారులు తమ అరటి ఆకులో ఉన్న మూడురొట్టెలలో ఒక రొట్టెతుంపు,కొద్దిగా కూర శివయ్యకొరకు ఇవ్వసాగారు.అందరివద్ద రొట్టే ముక్కలు,కూరా తీసుకువచ్చిన వంటమనిషి శివయ్య ఆరటిఆకు వద్దపెట్టివెళ్లింది.అప్పుడే భోజనశాలలో ప్రవేసించిన సదానందుడు 'నాయనా శివయ్య నీతోటి విద్యార్ధుల అరటి ఆకులో ఎన్ని రొట్టెలు ఉన్నాయి'అన్నాడు.'ప్రతివిద్యార్ధికి మూడు రొట్టెలవంతున వడ్డించారు,నేను రావడంతో అందరూ తలా ఒక రొట్టెలో సగభాగం నాకుఇచ్చారు'అన్నాడు శివయ్య.'ఇప్పుడు నీవద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి'అన్నాడు సదానందుడు.దాదాపు ఇరవై మంది విద్యార్ధులు తలా సగంరోట్టె ఇవ్వడం తొ నాకు పదిరొట్టెలు వచ్చాయి స్వామి'అన్నాడు 'రొట్టెలవారికంటే తుంపులవారే మేలుఅని' ఇప్పుడు తెలిసిందా? ఇదే నాటి నీప్రశ్నకు సమాధానం'అన్నాడు చిరునవ్వుతో సదానందుడు.చేతులు జోడించాడు శివయ్య.రొట్టెలు అందరికి సమానంగా వంటమనిషి పంచాడు.శిష్యులతో కలసి సదానందుడు భోజనం చేసాడు.


కామెంట్‌లు