పాపల పాల బుగ్గల్లో ప్రభవించిన బాల సాహిత్యం క్రమేపీ అక్షర రూపం దాల్చింది. ఆనాటి పెద్దలు బాల గేయాలను చిన్నారులకే అంకితం చేశారు. ఆనాటి భావుకులైన పెద్దలు ,మన పెద్దలు, చిన్నచిన్న గేయాలను రూపకల్పన చేసి ఊపిరి పోశారు. చిన్నారి పాపల పలుకులు లాగానే అర్థం పర్థం లేని కృతకంగా పదాలతో నిర్ధారించి మన జాతికి అందజేశారు.-అక్కడే బాల గేయాలకు ప్రాణ ప్రతిష్ట జరిగింది. మరొక సారి చెప్పుకుందాం.ముఖ్యంగా ఆది నుంచి చెప్పుకోవలసినవిషయం ఒకటి.అదే ఒకప్పుడు బాలాంత్రపు రజనీకాంత రావు గారు చెప్పిన సంఘటను చూద్దాంఒకసారి అబ్బాయి ఆటలు ఆడి ఆడి ఇంటికి వచ్చాడు. అమ్మ ని అడిగాడు కదా! అమ్మా! ఆడుకొని వచ్చానే,ఆడుకొని వచ్చానే, అలసిపోయానే అమ్మా! పాటలు పాడేవే అమ్మ, అలసి వచ్చానే, ఏమన్న పెట్టవే ఆకలేస్తుందే అంటూ ఆ బాలుని అమ్మ డబ్బాలో ఏదో తీసి ఇచ్చే వ్యవధిలోనే పాట వరుసలో రజనీ గారు కాగితం మీద కలం నడిచింది. ఓ మంచి పాట తయారైంది. అనుభవ పూర్వకమైన పాటలు అనుభూతిని కలిగిస్తాయి. అనుభూతి లేని రాసే గేయాలుఅసహజంగా ఉంటాయి. ఇప్పుడు సహజమైన ఈ పాటను మరొక్కసారి చెప్పుకొందాం, ఆటలు ఆడి, పాటలు పాడి, అలసి వచ్చానే తియ్యని తాయిలమేదో తీసి పెట్టవమ్మ అటక మీద అటుకుల కుండా అమ్మ దింపవమ్మా తియ్య తియ్యని తాయిలమేదో తీసి పెట్టవమ్మా.... పాట ఇలా సాగిపోయింది. ఈ పాట అలా పుట్టింది. రజనీకాంతరావు గారు రాసిన బాలల పాటలు చాలా భాగం ఇలా రాసినవే, సాధారణంగా ఇటువంటి అనుభవజ్ఞులు రాసిన పాటలలో జిలుగులు కంటే పిల్లల పాటలు,పాటల పలుకులు ఎక్కువ పాలుగా ఉంటాయనే అంటారు. నిజానికి పిల్లల పాటలు రాయాలంటే పిల్లలే గురువులు కావాలి. పిల్లలను పిల్లల భావాలను గురువులుగా స్వీకరించే హృదయం ఉండాలి. బాల సాహిత్యకారుల రచనలు నేడు భిన్నంగా కనిపిస్తాయి. ఈ సందర్భంలో స్వీయ అనుభవం కూడా బాలసాహిత్య వేత్తలకు ఉండాలి. ఇప్పుడు మనం అనుభవ పూర్వకమైన సంఘటనను అవలోకిద్దాం. ‌ ఇల్లంతా పెళ్లి సందడి గా ఉంది. పెద్ద అక్కకు పెళ్లికూతురుని చేశారు. చిట్టిని తోడి పెళ్లికూతురు చేశారు. గడపలకు పసుపులు, ఇంటికి సున్నాలు వేశారు. ఇల్లంతా కళకళలాడుతోంది. చిట్టి తోడిపెళ్లికూతురు అలంకారాలతో ఆడుకుంటుంది. తమలపాకులు అక్షతలు పువ్వులు మొదలైనవి పట్టుకుని, గడప దగ్గర కూర్చొనే ఆడుకుంటూ వాడుకుంటోంది. పెద్దక్క పెళ్లికూతురు నేను తోడ పెళ్లికూతురు ‌. పెద్దక్క కాళ్ళకు మల్లె గడపకు పసుపు రాశారు పారాణి పెట్టారు చుక్కల దిద్దారు పెద్దక్క పెళ్లికూతురు. నేను తోడ పెళ్లికూతురు మరి నాకు తోడిపెళ్లికూతురు ఎవరు? ఆ నాటి పిల్లలకి బాల కవిత్వం, అమాయకమైన ఆనందం.... మధుర మధురమైన భావ సౌందర్యం మనకు ఇటువంటి పాటలలో కనబడుతుంది. పిల్లల పాటలు స్వతహాగా ఊహించి రాసే వారికి ఇటువంటి సందర్భాలు అవసరం కాకపోవచ్చును. ఏదో ఒక ప్రయోజనకరమైన భావము లేనందు వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. మాటల తమాషా లతో బాల గేయాలు రాయడం నిజంగా ఒక అర్హతే కాదనలేము. కానీ దానికి ఒకింత భావం కూడా కలగలుపు చేస్తే లాభదాయకంగా ఉంటుందని బాల సాహితీవేత్తల అభిప్రాయం. విషయ విస్తరణ కంటే వివరణ ముఖ్యం. ఒక గేయంలో మనకు తెలిసిన అన్ని విషయాలు గుచ్చి గుచ్చి చెప్పాలనే ప్రయత్నం కంటే ఆ విషయానికి ఒక అంశాన్ని తీసి కానీ దాన్ని వివరంగా చెప్పడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. విషయ ఆదిఖ్యతను, బాలలు మొయ్య లేరు. చిన్న విషయమైనా విస్తరించి(డైలయూట్) చేసి చెప్పినందువలన వారికి బాగా వంట పడుతుంది. అనుష్కృతంగా వస్తున్న ప్రాచీన సాహిత్యంలోనూ పూర్వ సాహిత్యం లోన మనకు ఈ విధానం (టెక్నిక్) కనబడుతుంది. (తదుపరి మరికొంత) బెహరా ఉమామహేశ్వరరావు పార్వతీపురం


కామెంట్‌లు