భానుడి భగభగలు--- ఎండలు మండుతున్నాయ్! మానవ తప్పిదాలను.. అడుగడుగునా నిలదీస్తూ, భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి... ఎండలు మండకేం చేస్తాయి? మన తప్పుల్ని మనకే వెలెత్తి చూపుతున్నాయి మితిమీరిన , మిడి మిడి ఙ్ఞానంతో భావి తరాల భవిష్యత్తుని బేరుజువేసుకోకుండా చేతులారా చేసుకున్న తప్పులకు. ఎండలు మండకేంచేస్తాయి? చుక్కనీటికై చెమటోడుస్తూ, కోసుల దూరం అడుగులు వేస్తున్న దాహంకేకలు విని తప్పెవరిదని నిలదీస్తూ , ఎండలు మండుతున్నాయీ? పర్యావరణ సమతుల్యాన్ని ప్రమాదంలో పడేసిన మానవ జాతిని, ఇది ఎవరి నిర్లక్ష్యమని నిలదీస్తూ ఎండలు మండతున్నాయి.? మట్టిని మసిచేసి, గుట్టలను పిండి చేసి చెట్టును మట్టుబెట్టి నింగికి తూట్లుపొడిచి నేలతల్లికీ గాట్లుపెట్టి కాలుష్యం కోరలోకినెట్టి ఒకటా ..,రెండా ఎన్నో..ఎన్నెన్ని తప్పిదాలను మనముందుంచి తప్పెవరిదని నిలదీస్తూ ఎండలు మండుతున్నాయి..? ఇకనైనా సరిదిద్దుకోపోతే మనమే కాదూ భావితరాలు భానుడి భగభగలకు బలి కావలసిందే.! N.అపర్ణజ్యోతి.


కామెంట్‌లు