రామ చిలుక ******************** (బాలగేయం) బుజ్జిగాడు పెంచాడు జామచెట్టు చెట్టుపైన ఉన్నదొక్క రామ చిలుక చెట్టునిండ ఎన్నెన్నో జామపళ్ళు పండ్లన్నీ చూసింది రామచిలుక ఆపండు ఈపండు కొరికింది దోరపండునే నమిలి మింగింది చిలుక కొరుకు పళ్ళన్నీ ఎంతో తియ్యన జామపళ్ళ మీద చిలుక చూడ చక్కన బుజ్జిగాడు బుట్టతో వచ్చినాడు బుట్టలో పండ్లన్నీ వేసినాడు. చిలుకమ్మ కొరికిన పళ్ళంటూ చిట్టిపొట్టి నేస్తాలకు ఇచ్ఛినాడు. పద్మ త్రిపురారి జనగామ


కామెంట్‌లు