ఇదిగో సెగరెట్రీ ఓ వ్యాపార సూత్రం చెపుతా పెన్సిల్ తో రాసుకో(నేనే రాసుకోవాలి కదూ). ఇవాళ షార్పనర్ తో పెన్సిల్ చెక్కుతూ ఉంటే (దాంతో రాసేది ఏమీ లేదు చదివేది టిక్కులు పెట్టుకోవటమే) చిన్నప్పుడు పెన్సిల్ చెక్కుకునే పద్ధతి గుర్తుకు వచ్చింది. పెన్సిల్ ని బ్లేడ్ తో చెక్కుకునే వాళ్ళం , ఒక్కోసారి చాకుతో కూడా చెక్కుకునే వాళ్ళం.ఎటువంటి పనిముట్లు దొరకక ఓ పాలి ఉల్లిపాయ కత్తిపీట తోటి కూడా పెన్సిల్ చెక్కుకున్నాను. ఇంతకీ ఇవాళ నేను తెలుసుకున్న వ్యాపార సూత్రం ఏమిటంటే? షార్పనర్ తో చెక్కుతూ ఉంటే మనం ఎక్కువ రాయకుండానే పెన్సిల్ ములుకు విరిగి పోతూ ఉంటుంది.చెక్కే టప్పుడే చాలా సార్లు విరగటం కద్దు.కనుక ఓ షార్పనర్ పది పెన్సిళ్ళను కొనిపిస్తుంది. PS : ప్రజాహితార్ధం జారీ చేయడం అయినది. వసుధారాణి.


కామెంట్‌లు