మంచి అలవాట్లు (బాలగేయం) వేళకు నిద్దుర లేవాలి దుప్పటి మడతలు వేయాలి పరిశుభ్రతగా ఉండాలి పళ్ళను బాగా తోమాలి యోగాసనాలు వేయాలి త్వరగా స్నానం చేయాలి. దేవుడి దీపం పెట్టాలి అందరి క్షేమం కోరాలి అమ్మకు సాయం చేయాలి నాన్న దీవెన పొందాలి భుజముకు సంచి వేయాలి చకచక బడికీ వెళ్ళాలి గురువుకు దండం పెట్టాలి శ్రద్ధగ పాఠం చదవాలి మంచి అలవాటు కావాలి పెరిగీ పెద్దగ ఎదగాలి చదువుతు వెలుగుతు ఉండాలి. దేశ సేవకై నిలవాలి. పద్మ త్రిపురారి . జనగామ. ఇందులో ఉన్న పదాలు చిన్నవిగా,సరళమైనవిగా అనిపించవచ్చు. కానీ పిల్లలకు అర్థమయ్యే పదాలను ఉపయోగించి,పాటగా అందిస్తే,వారికెంతో ఉపయోగపడుతుందనే ఒక నమ్మకం.


కామెంట్‌లు