శనగలు తెచ్చిన సిరి.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్. అమరావతి నగరంలో రవణమ్మ అనే వితంతువు పాలవ్యాపారంచేస్తూ, శివయ్య అనే తన పాతికేళ్ల కుమారుడితో కలసి నివశిస్తూ ఉండేది.ఆరోజు చివరి పరిక్ష రాసి వచ్చిన తన కుమారుడిని అంగడికి వెళ్లి నిత్యవసర వస్తూవులు తీసుకు రమ్మంది.చేతిసంచితొ బయలుదేరిన శివయ్య తమ ఇంటికి ఎదురుగా ఉన్న రంగయ్య కిరాణా అంగడికి వెళ్లికావలసిన వస్తువులు చెప్పాడు.అంగడిలో ఉన్నపనివాళ్లు అవి పొట్లాలుకట్టసాగారు. బాల్యంనుండి శివయ్యను చూస్తున్న,అంగడి యజమాని రంగయ్య 'శివయ్య ఈరోజు తొ పరిక్షలు ముగిసాయటగా,మరేంచేద్దాం అనుకుంటున్నావు ఉద్యొగప్రయత్నాం చేస్తావా' అన్నాడు. ' అవును మావయ్య 'అన్నాడు శివయ్య.'సరే నీకు ఓ చిన్న పరిక్ష పెడతాను.నీ తెలివితేటలతొ కొద్దిపాటి పెట్టుబడితొ న్యాయమార్గాన,ఎలా సంపాదించ గలవొ చూస్తాను'అని కిలోశనగలు పొట్లంకట్టి శివయ్య చేతికి ఇచ్చి'ఇదిగో నీవ్యాపారానికి పెట్టుబడి, వీటికి నీవు డబ్బులు చెల్లించ వద్దు, ఆరునెలల తరువాత వీటిపై నీవు ఎంత సంపాదిస్తావో నిజాయితీగా నాకు తెచ్చి చూపించు'అని శివయ్యకు శనగల పొట్లాంస్వయంగా అందించాడు రంగయ్య.మీవంటి పెద్దల ఆశీర్వాదం,మంచి ఆశయం,కలిగి ఉంటే లక్ష్యం చేరు కోవడం సాధ్యమే,మీ కోరిక మేరకు ఆరు నెలల తరువాత కనిపిస్తాను' అని సరుకులు తీసుకొని ఇల్లు చేరి,శనగలు తల్లి చేతికి ఇచ్చి రేపటి సాయంత్రానికి గుగ్గిళ్లు వండమన్నాడు. మరుదినం సాయంత్రం గుగ్గిళ్లు బుట్టలో పెట్టుకుని బిందెలో నీళ్లు తీసుకుని అడవి లోనుండి నగరం లోనికి జనం వచ్చేదారిలో చెట్టుకింద గుగ్గిళ్లబుట్టతొ కూర్చున్నాడు.అడవిలో కట్టెలు కొట్టేవారు,అదే మార్గన ప్రయాణించేవారికి గుగ్గిళ్లుపై కారంపొడి,నిమ్మకాయ రసం వేసి అమ్మసాగాడు శివయ్య.దారిన వెళ్లేవారు గుగ్గిళ్లు తిని చిల్లరడబ్బులు ఇచ్చేవారు.కట్టెలుకొట్టేవారు మాత్రం గుగ్గిళ్లు తిని రెండు కట్టెలు ఇచ్చివెళ్లేవారు.కిలోశెనగలుతొ ప్రారంభమైన గుగుళ్ల వ్యాపారంమూడు మాసాలలొ అయిదు కిలోల వరకు పెరిగింది. ఎండు కట్టెలు పసువుల పాకనిండుగా వచ్చాయి.వర్షలు పడటంతొ తనవద్ద ఉన్న ఎండుకట్టెలు అన్ని అమ్మి మెత్తం డబ్బు రంగయ్యకు తీసుకు వెళ్లి చూపిస్తూ' మామయ్య మన మధ్య బంధుత్వం లేకపోయినా బాల్యంనుండి నన్ను మీరు బాగా ఆదరించారు. ఇదిగో మీరు పెట్టిన పరిక్షలో నేను సంపాదించిన ధనం'అన్నాడు శివయ్య. పకపక నవ్విన రంగయ్య, 'బంధుత్వం లేకపోవడమేమిటి? నీకు సమ్మతమైతే నీతొపాటు చదివిన నాఏకైక కుమార్తెను నీకు ఇచ్చి వివాహంజరిపిస్తాను'అన్నాడు. 'అమ్మను పంపిస్తాను మాట్లాడండి అన్నాడు.శివయ్య.


కామెంట్‌లు