ధైర్య జ్యోతి ******************** (బాలగేయం) పిల్లలూ పిల్లలూ వినరండీ ఈ కథ నాన్నకే అమ్మయిన జ్యోతక్కదీ కథ పంజాబీ అమ్మాయి సిర్హులీ చిన్నారి గాయమైన నాన్నకు తోడుగా ఉన్నది ఉన్న ఊరిలో అమ్మ ఆసుపత్రిలో నాన్న అదరలేదు బెదరలేదు సేవలెన్నొ చేసింది కరోనా కట్టడి తెచ్చిందీ కష్టము ఉండలేక నిలువలేక కుమిలి కుమిలి పోయింది తనకు తానె ధైర్యమయి సైకిలెక్కి కదిలింది. వేయి కిలోమీటర్లు నాన్నతో నడిచింది తొమ్మిదో రోజున సిర్హులీ చేరింది అమ్మ కన్నీరు తుడిచి ఆనందం నిలిపింది భళి భళి సాహసమని ఊరంతా పొగిడింది ప్రేమజ్యోతిగా నిలిచి వెలుగులే పంచింది. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు