తెలుగు -- (బాలగేయం) అమ్మభాషరా మన తెలుగు అందమైనదీ మన తెలుగు చక్కెరకన్నా తీయనిది చక్కని పదములు కలిగినది మధురమైనదీ మన తెలుగు మహిమను కలిగిన మన తెలుగు ఎందరెందరో కవివరుల కవన మాలిక మన తెలుగు పాట పద్యం సామెతలో ఇంపుగ ఒదిగే మన తెలుగు కథలు లేఖలు కావ్యాలు విరివిగ పండిన మన తెలుగు విజ్ఞానం పంచును మన తెలుగు సుజ్ఞానం పెంచును మన తెలుగు పద్ధతి నేర్పును మన తెలుగు ఒద్దిక నేర్పును మన తెలుగు తేనెలొలుకురా మన తెలుగు తేజరిల్లురా మన తెలుగు. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు