బుడ్డి మనవడికి ఆప్యాయంగా తలంటు పోసేస్తున్న బామ్మగారు ఎంత ఆనందపడుతున్నారో, ఆ బుడ్డి గాడు కూడా అంతే రేంజ్ లో ఆ స్నానం ఆస్వాదించేస్తున్నాడు.స్నానం చేయిస్తున్న ప్రదేశ పరిసరాలు గమనించండి.దూరంగా లీలగా కనిపిస్తున్న కొండలుపారుతున్న నది.........కొబ్బరిచెట్లు.......నదికి కొబ్బరిచెట్లకి మధ్య పచ్చని పొలాలుచక్కగా సిమెంట్ చేయబడిన గచ్చు.........చిరునవ్వు చిందిస్తూ నీళ్లు పోసే బామ్మగారు కూచున్న తీరు.........రెండు చేతులూ నేల మీద ఆనించి కూచున్న మనవడి భంగిమ.....ఎంత కళాత్మకంగా ఉన్నాయో గదా?లెక్కలతో కొలవలేనంత ఆప్యాయతానురాగాలు ,గోరు వెచ్చటి నీటితో బాటు , మనవడిమీద కుమ్మరిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియా లో కనపడితే తెగ ముచ్చటపడి దిగుమతి చేసుకున్నా!ఇంత సహజంగా ఆ బామ్మ మనవళ్ల ని ఫోటో తీసిన ఆ ఫోటోగ్రాఫర్ నైపుణ్యానికి, కళా దృష్టికి, శత కోటి వందనాలు.- సత్యవోలు పార్థసారథి


కామెంట్‌లు