ఏ జర్నీ అఫ్ ది జర్నలిస్ట్ : కృష్ణ కంబాలపల్లి ..: అతనొక జర్నలిస్ట్.. సాన్నిహిత్యం లేకున్నా.. అభిమానిని.. అయన సోదరుడు శేఖర్ నాకు మంచి స్నేహితుడు.. నేను పిల్లల వద్దకు న్యూజిలాండ్ వచ్చిన తరువాత ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది.. కానీ చదవాలన్న కోరిక.. ఎలా.. నేను ఇండియా వెళ్లిన వెంటనే చదవాలని అనుకున్నాను.. కానీ ముఖ పుస్తకం లో నాతొ పాటు వున్న కృష్ణ ఫోటోలు చాలానే చూసాను.. కావాలంటే పి డి.ఎఫ్ పంపిస్తా అని పోస్ట్ పెట్టారు.. వెంటనే అడిగారు.. నిన్న పంపారు.. నిన్న, ఈ రోజు ఏకబిగిన చదివాను.. జర్నలిస్ట్ అంటే ఒక చరిత్ర. ఒక నిజాయితీ, ఒక నిబద్ధత అన్న పాదాలకు ఈ పుస్తకం అద్దం పడుతుంది. చాలా మంది రిపోర్టర్లు పెద్ద వాడితో తీసుకున్న ఫోటోలు పెట్టుకుంటూ సంబర పడుతుంటారు.. కానీ సమాజానికి ఏమీ చేసిన దాఖలాలు వుండవు.. ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించు కోవడం. గొప్పగా చెప్పు కోవడం మాత్రమే వారికి తెలుసు.. అధికార గణం అంతా తమ వారే కాబట్టి పని చేయకున్నా జీతం జేబులో పడుతుంది.. కానీ నిబద్ధత వుండే వారికీ ఈ పత్రికా రంగం ఒక కత్తిమీద సాము.. ఇదే పరిస్థితి డెస్క్ లోనూ ఉంటుంది.. తమ ప్రతిభను నిరూపించుకోవడానికి నిరంతరం శ్రమించాలి. అందులో తెలంగాణ జర్నలిస్టులు ముందు వరుసలో వుంటారు.. ప్రతి వారిది ఒక ప్రత్యేకత.. అయినా వారిని పరిగణనలోకి తీసుకోరు.. కానీ నిప్పును ఎన్నాళ్ళు దాచి పెట్టగలం. మరి ఈ పుస్తకం లోని ప్రతి పేజీ, ప్రతి వాక్యం ఒక దృశ్య కావ్యంగా వుంది. చరిత్రకు కూడా అద్దం పడుతుంది.. థాంక్స్ కృష్ణ గారు.. నాకు పుస్తకం పంపి చదివించి నందుకు . - టి. వేదాంత సూరి .


కామెంట్‌లు