మాతృదినోత్సవం --అమ్మకు జై---ప్రపంచ వ్యాప్తంగా అమ్మలను పూజించుకునే వేడుక . మన భారతీయ సనాతన సంస్కృతికి మూలం అమ్మె . మన వేద పురాణాలలో అమ్మ శక్తి స్వరూపంగా ఆరాధించబడుతూనే ఉంది .‌మన ప్రాచీన సాంప్రదా‌యాలలో మాతృ వ్వవస్థ కే పెద్ద పీట వేశారు . ఇప్పటికీ అమ్మ మన కుటుంబాలలో పెద్దగా వైభవ సాక్షాత్కరం ఒక వాడుక ,వేడుక .. యుగాల నుండి మన పురాణేతిహాసాలలో "మాతృదేవోభవ" అని అమ్మకు పట్టాభిషేకం చేశాయి . అమ్మ సేవలు అమూల్యాలు - ఆ ఋణం తీర్చుకోలేనిది కూడా .తన జీవితమంతా ఒక్కొక్క ప్రాయంలో ఒక్కొ రకంగా నిస్వార్థ సేవలందిస్తున్న మహిళ ఆదిశక్తిగా కొలవబడి విశ్వమంటా హైందవ జీవన పవిత్రతకు చిరునామాగా నిలచింది . ఎవరికైనా వారి మాతృమూర్తి నిత్య ప్రాతః స్మరణీయురాలు ,నిత్య పూజ్యురాలు . ప్రత్యేకంగా మాతృదినోత్సవాన్ని జరుపుకునే ఆనవాయితి అయితే మన సాంప్రదాయంలోనైతే లేదు .‌కాని ప్రపంచమంతా ఈ మాతృదినోత్సవం మన నిత్యం పూజించుకునే మాతృదేవోభవ లో భాగం కనుక మన దేశంలో కూడా ఈ ఉత్సవాన్ని మన సాంప్రదాయ రీతులలో జరుపుకొంటూ అమ్మ సేవలను ,ఆప్యాయతానురాగాలను స్మరించుకోవడం చిన్నారులకు ఒక అవగాహన కల్పించడమే . చిన్న రాయి తగిలినా అమ్మా అని తలచుకునే దేవత అమ్మ .మన పురాణాలలో ,చరత్రలో మాతృమూర్తులు మలచిన ఎందరో మహానుభావులు మనకు దర్శనమిస్తారు .నాన్నతో చెపుకోలేనివి అమ్మతో చెప్పుకుంటాం .. అమ్మంటే చనువు ,అమ్మంటే మన మంచి నేస్తం .. ఆకలైతే ఆమ్మ ,సంతోషమొస్తే అమ్మ .‌‌. తన కడుపులో పడ్డ మరు క్షణం నుండి బిడ్డ క్షేమానికి తన సర్వస్వాన్ని ధారపోసే నిస్వార్థ జీవి అమ్మ .పిల్లల ఆనందాలతో తను మురిసిపోతూ ,మనవలు ,మనవరాళ్ళతో ముచ్చటపడే అమ్మ ఆనందమే మహాలక్ష్మి కొలువు . లక్ష్మి ,సరస్వతీ ,శాంకరీ స్వరూపులైన అమ్మలందరికీ ప్రణమిల్లుతూ .. అమ్మ కు జై .- రత్నాకర్ శర్మ .


కామెంట్‌లు