వైరాగ్యం!(కథ) -సుజాత.పి.వి.ఎల్- ఒక గురుకులంలో ఇద్దరు సాధకులకు శిక్షణ పూర్తయ్యింది. ఇద్దరికీ వివేకము, విచక్షణలున్నాయి. అయితే వీరిరువురిలో ఎవరికి వైరాగ్యం పట్ల విశ్వాసం ఎంత ఉన్నదో తెలుసుకొనేందుకు గురువుగారు పరీక్ష పెట్టదలచుకున్నాడు.వారిద్దరినీ తీసుకుని అరణ్య మార్గాన కాలి నడకన వెళుతుండగా ఒక అపూర్వమైన వజ్రం తళతళ మెరుస్తూ మట్టిలో కనిపించింది.మొదటి వాడు ఆ వజ్రాన్ని ఎవరైనా చూస్తారేమోనని కాలితో మట్టిని నెట్టి వజ్రాన్ని కప్పేసి, "గురువుగారూ! మీరిద్దరు ముందు నడుస్తుండండి..నేను వెనుక మిమ్మల్ని అనుసరిస్తాను" అన్నాడు.వెనుకనున్న రెండోవాడికి విషయం తెలిసినా అభావంగా ఉన్నాడు.ఇదంతా గమనించిన గురువుగారు రెండోవాడి వైపు తిరిగి నువ్వు ఉత్తీర్ణుడైనావు నాయనా!ఇక నీవు వెళ్ళొచ్చు అన్నాడు.అదెలా స్వామీ?ప్రశ్నించాడు మొదటివాడు.మట్టీ, మాణిక్యం ఒకటేలా కనబటమే వైరాగ్యం నాయనా! అన్నాడు.


కామెంట్‌లు