పల్లె పండుగ ******************* (బాలగేయం) చిన్ని చిట్టి లేచారు ముంగిట ముగ్గులు వేసారు పేడతొ నేలను అలికారు గోడకు జాజును రాసారు గడపకు పసుపు పూసారు ద్వార తోరణం కట్టారు పిండివంటలు చేసారు ఒకరివి ఒకరికి ఇచ్చారు పప్పు బెల్లం తెచ్చారు దేవుడి మందు పెట్టారు. అందరు కలిసి ఉన్నారు ముద్దుగ ముచ్చట పెట్టారు ఇరుగు పొరుగు కలిసారు పల్లె పండుగ చేసారు. పద్మ త్రిపురారి జనగామ. (ఇంకా ఇల్లు అలకడం,జాజు పూయడం ఉన్నాయా అని అనుకోవద్దు.పల్లె ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని ఇళ్ళల్లో బండలు లేకుండా,ఆవుపేడతో అలికి,జాజు పూయడం కనపడుతోంది.ఇది ఆరోగ్యదాయకం కూడా. ముందు తరాలవారికి పల్లెల్లో పండుగ అంటే ఇట్లా ఉంటుంది అని తెలుపాలనే ఉద్దేశంతో మాత్రమే రాసిన గేయం ఇది.).


కామెంట్‌లు