సీ: అంజలి పుత్రుండు యతిబలవంతుండు హనుమంత నామమై యవని నెగసి రామ భక్తుడిగను రామభజనలతో నిత్యము పూజలు నింగి నేల అభయంబు లోసుగు నాంజనేయకరము ఆపదలందున నాదుకొనును వానర సేనతో వాయు పుత్రుండవై విజయము బొందిన వీర హనుమ ఆ.వె: హనుమ దీక్షతోడ యఖిలాండమంతయూ రామ హనుమ జపము లక్షణముగ అవని పూజనొంది హనుమ జయంతిన మారు మ్రోగినాయు మారుతినిల ఉండ్రాళ్ళ రాజేశం సీస పద్యం


కామెంట్‌లు