నీటి విలువ--(బాలగేయం) అడవిలోన సభపెట్టి సింహరాజు నీటి విలువ అందరికీ చెప్పినాడు ఎలుగుబంటి ఏనుగు నక్కబావ లేడిపిల్ల కుందేలు పులిమంత్రి చిలుక నెమలి కోకిల పావురాలు కొంగ కోతి తాబేలూ వచ్చాయి నీళ్ళతోనె మనజాతి బ్రతికేది నీళ్ళులేని అడవికి దిక్కేది మనుషులైన నీళ్ళు లేక బ్రతుకలేరు అయిన కాని నీటి వృధా ఆపలేరు అడవి నరికి భవనాలు కట్టినారు చెరువు బావి నదులన్నీ మ్రింగినారు ఇకనైనా ఆపుదాము ఈ ఘోరం నీటికొరకు మనమంతా ఏకమవుదాం ఇంకుడుగుంత కట్టమని చెబుదాము నీళ్ళ పొదుపు కావాలని చాటుదాము. సింహరాజు మాట విన్న అడవిలోకం కదిలింది నీటివిలువ చెప్పడానికి. -పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు