నేనే గొప్ప! ( కథ ) -సుజాత.పి.వి.ఎల్-వంకాయ: హేయ్!, కూరగాయల అన్నిట్లో కల్లా నేనే మహారాజుని. అందుకే నన్ను సృష్టించిన ఆ బ్రహ్మ నా నెత్తి మీద కిరీటం కూడా పెట్టాడు. నేనే మీ అందరి కన్నా గ్రేట్ అంది.. మిగతా కూరగాయల్తో.పొట్లకాయ: కిరీటం ఉండటం కాదు గొప్ప అన్నిట్లో కల్లా నేనే పొడుగు తెలుసా..!బెండకాయ: మీ మొహం. నన్ను చూడండి ఎంత సుకుమారంగా ఉంటానో. అందుకే నన్ను మగువల అందమైన చేతి వేళ్ళతో పోలుస్తారు.దొండకాయ: ఓస్! చేతి వేళ్ళతో పోలిస్తే అంత సంబరమైతే, నన్ను కవులు 'దొండపండు' లాంటి పెదాలు అంటూ భావుకత్వంతో వర్ణిస్తారు.ఉల్లిపాయ: నాకు ఘాటెక్కువని, కోస్తే కళ్ళెంబట నీళ్లు వస్తాయని అంటారు కానీ నేను లేకుండా ఏ కూర చేసుకోలేరు మరి..బీరకాయ: మీ అందరికన్నా నేను ఎంతో గొప్ప. పత్యం కూరలకు నేనే స్పెషల్. నాలో పీచు ఎక్కువగా ఉండటం మూలాన నా తొక్కలు,చెక్కులు కూడా వంటల్లో వాడేస్తారబ్బా. నాలో వ్యర్థమయ్యే భాగమే లేదు. చిక్కుడుకాయ: గోరుతో గిల్లి వండుకుంటారనే కానీ, నా అంత పిండిపదార్థాలు, మాంసపుకృతులు మీలో ఎవరికైనా ఉన్నాయా..? కాకరకాయ: నేను చేదని ఎవరూ ఇష్టం చూపకపోయినా, అందరూ నన్ను కొనుక్కుంటారు అదేంటో మరి! మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచేది కూరగాయల్లో నేనొక్కదాన్నే.బంగాళాదుంప: నాకు సహనం ఎక్కువ. కూరలో ఉప్పు ఎక్కువయితే చిటికలో తీసేస్తా. వేపుళ్ళకి, ముద్ద కూరలకి, చిరుతిండ్లకి, పూరీ కూరలకి, పానీ పూరీలకి నేనే దిక్కు మరి. చిన్నా పెద్దా అందరూ నన్ను ఇష్టంగా తింటారు..టమేటా: పప్పులోకి, కూరలోకి, పచ్చడిలోకి అన్ని విధాల నేనే. నేను లేనిదే వంట గదిలో వంటకమే లేదు . నిగనిగలాడే ఎర్రని మేని వర్ణంతో కూరగాయల అన్నిట్లోకెల్లా అందంగా ఉండేది నేనే.పచ్చిమిరపకాయ: కాయగూరలతో సమానంగా నన్ను వినియోగిస్తున్నారంటే చూడండి నేను ఎంత గొప్పో. నాకు గానీ, మండిందనుకో.. ధరతో పాటు మీ నోటిని కూడా మండించేస్తా జాగ్రత్త! గుమ్మడి కాయ: మీ కూరగాయలు అన్నీ కలిపిన నా బరువుకి సరితూగ లేవుగా! నన్ను కూరల్లోనూ పులుసుల్లోనే కాదు. నిల్వ ఉంచుకునే ఒడియాల్లోనూ కూడా నేనే! అంతే కాదు శుభకార్యాలకు ముందుండేది కూడా నేను మాత్రమే!మిడిసి పడుతూ అప్పుడొచ్చింది కరివేపాకు. కరివేపాకు: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా ప్రశ్న! మీరు ఇన్ని గొప్పలు చెప్పుకున్నారు కదా ఒక్క రెబ్బ నేను లేనిదే కూరల్లో సువాసన ఉంటుందా నేనుంటే ఆ ఘమ ఘమే వేరు.కూరలో వేశాక తింటారా తీసి పక్కన పెడతారా అనేది పక్కనుంచితే నన్ను వేసుకోకుండా ఏ కూర వండలేరు కదా! నేను కూరకి అందమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను. అందుకని నా కన్నా తోపులెవరూ లేరిక్కడ.. హ్హ.. హ్ష.. హ్హ అంది.అన్ని కూరగాయలు మౌనంగా వుండిపోయాయి.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
అమ్మలా పరిపాలించాలి!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి