ఈ తేనె పాటల పిట్ట (హమ్మింగ్ బర్డ్)కి, ఇంత గొప్ప అతిధికి మా పెరటిలో ఎండిపోతూ మూడాకులు మిగిలిన బొప్పాయిచెట్టు రాత్రి ఆతిధ్యమిచ్చింది. సందెచీకట్లో కాడమీద గొడుగులాంటి ఆకుకింద ముడుచుకు కూచున్న ఈ బుజ్జి పిట్ట నా కంట పడింది. తెల్లవారి బొమ్మ తీద్దామని వెళ్ళగానే తుర్రుమంది. మా మూడాకులు బొప్పాయిచెట్టు నా కన్నా ధనవంతురాలని అప్పుడు నాకు తెలిసింది. - విరించి లక్ష్మి


కామెంట్‌లు