కొయ్యబొమ్మలం పొనిక కర్రతో పొందికగా తీర్చి, చింత జిగురుతో అందంగా అందరిని అలరించే .. నిర్మల్ కొయ్మబొమ్మలం.. సప్తవర్ణాలతో సకల ఆకృతులతో జీవంపోసుకొని.. విశిష్టకళానైపుణ్యానికి మెచ్చుతునకలం... సజీవ,సహజత్వంఉట్టిపడే సంపూర్ణకళారూపాలం.. హస్తకళాకృతులను అందమైన నకాషిచిత్రాలను తెలంగాణ వారసత్వసంపదగా కళ్ళకు కట్టినట్లుగ కనువిందుచేసే బొమ్మలం.. నైజాం నవాబులనే మెప్పించి, ఖండాంతరాలలో కొలువుదీరాo. బహురూపాలైన మానవసంబంధాలకు ఆనవాళ్ళం.. ఆడబిడ్దలకుఅత్తింటి కానుకలం.. మమ్మల్ని కర్మాగారాల ఉత్పత్తులనుకుంటున్నారేమో.! నకాషీల చేతుల్లో ఊపిరి పోసుకుంటున్న బొమ్మలం.. శతాబ్దాల చరితకు సజీవ సాక్షులమై, నిర్మల్ ఖ్యాతిని నలుదిక్కులా చాటిన కొయ్యబొమ్మలం. N. అపర్ణ జ్యోతి. నిర్మల్


కామెంట్‌లు