గడియారం!! గోడమీద అందంగా అలంకరింపబడిన బంగారు గడీ! లోలకం చేసే గరిమనాభి విన్యాసం! మెలికలు పడని నడక హృదయ వలయంలో శబ్ద రవళి! పగటితో భేదించి రాత్రిని రాత్రితో వాదించి పగటి గతిని మార్చే గతి తార్కిక శక్తి ఆకారాలు రూపాలు వేరైనా నడిపించే తత్వం అబేధం! సర్వ కాలాల్లోనూ ఐక్యతా ప్రబోధం! రెండు జీవితాలను ముడిపెట్టె మూడు ముళ్ల ముహూర్త దర్పణం! సెకన్ల పర్వంలోoచి జారిపడిన జనన మరణ ఆశ్వాసాలు క్యాలెండర్లులు పంచాoగాలు గడియారం గంటలూ వెనకకు తిరుగ లేవు! కన్నీళ్లు తుడిచేస్తూ, గుండెలు కూడదీసుకుంటూ చేదు ముళ్లని ఏరేస్తూ గమనం ఆపకుండా ముందుకు పొమ్మనే వాటి రహస్య సందేశం కె ఎస్ అనంతాచార్య.


కామెంట్‌లు