పద్మకవి పురస్కారానికి డా.ధనాశి ఉషారాణి ఎంపిక ...... చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండల పరిధిలోని భాకరాపేట చెందిన కవయిత్రి డా.ధనాశి ఉషారాణి పద్మశేఖర సాహితి వేదిక,సూదిరెడ్డిపల్లి,కర్నూలు వారు అందించే పద్మకవి పురస్కారానికి ఎంపికైనట్లు తెలియజేశారు,ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సాహిత్యంలో జనాదరణపొందిన ప్రముఖ చిత్రకారుడు,రచయిత,కవి బోయ శేఖర్ రూపొందించిన నూతన కవితా ప్రక్రియ పద్మరత్నాలు ప్రక్రియలో వంద ( శతకము ) పద్మరత్నాలు పూర్తిచేసినందుకు గాను డా.ధనాశి ఉషారాణి ను పద్మకవి పురస్కారానికి ఎంపికచేసినట్లు తెలియజేశారు,ఉషోదయ సాహితీ వేదిక ద్వారా సిరిమంజరి ప్రక్రియను రూపొందించి కవులను ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు పద్మరత్నాలు ప్రక్రియ రూపకర్త, పద్మశేఖర సాహితి వేదిక అధ్యక్షులు బోయ శేఖర్ అభినందనలు తెలియజేశారు.


కామెంట్‌లు