వేసవి వెన్నెల్లో ... పున్నమి చంద్రుళ్ళు !!--- హరిగాడు గిరిగాడు హరనాథ సుడిగాడు నిలువీత చెలికాడు నిలువెల్లా చలిగాడు జట్టు జట్టుగా నడిచి ఏటిగట్టున కలిసి ప్యాంటు షర్టూ విడిచి పరుగు పరుగున దుమికి నింగి సూరన్నను నవ్వుతూ చూసేసి ఎండలను నిండుగా వెండి వెన్నెల చేసి ఎంత సరదాల సందడో ఆనాటి వేసవి .. ! ఎన్ని తిరనాళ్ల వేడుకో ఆ మిత్ర కూటమి !! -సత్యజి ప్రజా


కామెంట్‌లు