చక్కని నేస్తం -- (బాలగేయం) నీలినీలి నింగిలో చందమామ నిండైన రూపం నీదయ్య వెన్నెల్లో వెన్నెల్లో చందమామ పున్నమి రాజువు నీవయ్య వెలుగుల్లో వెలుగుల్లో చందమామ వేవేల కిరణాలె నీవయ్య చుక్కల్లో చుక్కల్లో చందమామ చక్కన్ని నేస్తం నీవయ్య మబ్బుల్లో మబ్బుల్లో చందమామ మాకోసం ఒకసారి రావయ్య చందమామ చందమామ చందమామ నువ్వొస్తేనే సంతోషం చందమామ పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు