మనసును రంజింప చేసే "మనో కెరటాలు --కయ్యూరు బాలసుబ్రమణ్యం కలం నుండి జాలు వారిన మరో కవితా సంపుటి "మనో కెరటాలు " .ఈ సంపుటిని సమాజ శ్రేయస్సుకై ఓ తపస్సులా తీర్చిదిద్దారు.ఆయన రాసే ప్రతి అక్షరం పాఠకుడి మెదళ్ళోకి సూటిగా చొచ్చుకుపోయి ఆలోచింప జేసే తత్వం ఆయన కలానిది.' నేటి కవి' అను కవితలో సామాన్యుడిని చైతన్య పరచాలి-సమతా మమతా పంచాలి- అంటూ అప్పుడే నీ కవిత్వానికి పరిపూర్ణత -కవిగా నీకు చేకూరును సార్థకత అంటూ అసలైన కవి లక్ష్యాన్ని, లక్షణాన్ని చెప్పకనే చెప్పారు. 'అమ్మ-పునర్జన్మ' కవితలో 'అమ్మంటే నీకు జన్మనిచ్చి తనకు పునర్జన్మనిచ్చుకునేది 'అనే కొత్త భాష్యం చెప్పారు కవి. పల్లె వదిలి పట్నం వైపుపరుగు తీసేవారికి చెంపపెట్టుగా పల్లె అంటే నీ బాల్యపు జ్ఞాపకాలు అంటూ మందలిస్తారు "పల్లె పిలుస్తోంది" అను కవితలో. మహిళల పట్ల గౌరవం 'మహిళా..వందనం"అను కవితలో అందం గాపొదిగారు పాఠశాల క్రమశిక్షణకు కంచుకోట ,నడవడికకు రాచబాట అని 'మా పాఠశాల' అను కవితలోఅనడం గురువుగా బడి అంటే వారి మక్కువ ఎక్కువనే చెప్పక చెప్పునట్లే అవుతుంది. 'అవని ఆవేదన'లో అధిక జనాభాతో పాటు ఇంకా ఎన్నో కారణాలు అవనిని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.అంతలోనే మళ్ళీ సాంప్రదాయ విలువలకి 'ప్రకృతి పులకరిస్తుందని ఆశాభావం కనబరుస్తారు. 'ఫోర్త్ ఎస్టేట్ ' అను కవితలో నిజాన్ని నిర్భయంగా చాటి అవనీతికి నడుం బిగించిప్రజల ఆలోచనలను చైతన్య పరచి మంచి, చెడులకు వారధిగా నిలిచేదంటూ చాలా చక్కగా ,అద్భ తంగా వర్ణించారు. 'గ్రంధాలయం' సాహిత్య భాండాగారం అంటూ చదవడం అనే మంచి అలవాటుని ప్రోత్సహిస్తారు.ఆడపిల్ల 'కవితలో అమ్మాయి జగతికి వెలుగు అంటూ జననం ,చదువుకై పిలుపునిచ్చారు.నిజమైన అభివృధ్ధి 'అసలైన గణతంత్రంలో ,దేశభక్తిని 'భార త్ పిలుస్తోంది' కవితలో అలవోకగా అందించారు. ఆశయాలు ఉండడం కాదు సాధించాలి అప్పుడే ధరణి, సూరీడు కూడా నీకు దాసోహం అంటూ'మరో ప్రపంచం' కవితలో ఉద్భోదిస్తారు.మృధుమధురంగా విభిన్న శైలిలో తనలో దేశభక్తిని చాటుతూ ,సమాజంలో ఒక వ్యక్తిగా సమాజస సేవలా సాహితీ సేవ చేస్తూ అందరి హృదయాలలో కలకాలం నిలిచే ఆదర్శవంతమైన కవి కయ్యూరు బాలసుబ్ర మణ్యం.ఆయన రచనలు సమాజానికిఅవసరం. "మనో కెరటాలు" నూతన కవులకుమార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.


కామెంట్‌లు