స్వర సరస్వతీ పుత్రులు పురస్కారానికి చిత్తూరుజిల్లా కు చెందిన ధనాశి ఉషారాణి ఎంపికయ్యారు. చిత్తూరుజిల్లా,చిన్నగొట్టిగల్లుమండలము భాకరాపేట గ్రామానికి చెందిన ప్రముఖ కవి సేవకురాలు ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రములోని సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధన సంస్థ ,బుధవార్ పేట్, నిర్మల్ వారు అందించే స్వర సరస్వతీ పుత్రులు పురస్కారానికి ఎంపికైనట్లు తెలియజేశారు,సిరిమంజరి నూతన ప్రక్రియను వినూత్నంగా రూపొందించి అందరీ ప్రశంసలు పొందారని ధనాశి ఉషారాణి ని కొనియాడారు ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణలో సాహిత్యంలోన జనాదరణపొందిన ప్రముఖ రచయిత,కవి,పరిశోధకులు అయిన డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్ రూపొందించిన నూతన కవితా ప్రక్రియ స్వరము ప్రక్రియలో వంద ( శతకము ) స్వరాలు పూర్తిచేసినందుకు గానుధనాశి ఉషారాణిని స్వర సరస్వతీ పుత్రులు పురస్కారానికి ఎంపికచేసినట్లు తెలియజేశారు, డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్ అభినందనలు తెలియజేశారు.


కామెంట్‌లు