కూరగాయల బడి ******************** (బాలగేయం) బెండకాయ టమాట బడికి వెళ్ళాయి బడిలోనికి వంకాయ వచ్చి చేరింది. వంకాయకు చింతకాయ నేస్తమయ్యింది అది చూసి బీరకాయ గంతులేసింది సొరకాయకు ఇది చూసి కోపమొచ్చింది పక్కనున్న దొండకాయ చెవిన వేసింది ఇవి రెండూ వంకాయతొ గొడవపడ్డాయి గొడవలో దొండకాయ కింద పడ్డాది. ఏడుస్తూ సొరకాయ అలిగి కూర్చుంది మునక్కాడ గురువుగారు వచ్చి చూసారు పదపదమని తరగతికి తీసుకెళ్ళారు అక్షరాలు చూపించి నేర్వమన్నారు. ఆలుగడ్డ చామగడ్డ దోసకాయలు చదువుకొని ఎదిగాయి చూడండి. అల్లరంత మాని మీరు చదవమని మునక్కాడ గురువుగారు చెప్పి వెళ్ళారు. కూరగాయల బడిలోని కూరలన్ని గురువుగారి మాట విని చదువుకున్నాయి. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు