నా పల్లె సొగసుల్లో మార్పేదో వచ్చిందీ పచ్చని పైరులతో కళకళలాడేస్తుంది. ఏరులె సెలయేరులె పరువాల కన్నెలా పరుగులతో నాడీ పైరుల్లొ సైయాటలై పరవశాల పొంగిపోతోందీ. ఊరూరూల కలిపేలా నింగినంటె పెద్దవనాలే పచ్చని పంటసిరులలో పెద్దముత్తైదువులానహో అందాలవిరులతో ఆదిలక్ష్మిలా అడుగడుగున శోభలతోనుండే. ఎంతెంత మారిపోయే నాపల్లెలే కలిసిమెలిసి కమతాలతోనా పల్లెవాసులదిగో పట్నాలనొదిలేసే కాలమే గడిపేయ కదిలేరదిగో కరోన పాపమో పుణ్యమోగానీ పల్లెలకు నిపుడు పంటల ప్రాణమొచ్చే మోజువీడీపోయే మోడువారిన బతుకులో ఆశల రెక్కలొచ్చే చేతినిండా పనికి చేవవచ్చే -జయంత్ నమిలకొండ


కామెంట్‌లు