కోతికొమ్మచ్చి --- (బాలగేయం) కోతికొమ్మచ్చాట ఆడుతున్నాను ఇంతలోన కోతి ఒకటి తానె వచ్చింది. పిల్లగాడ!నువ్వేనా ఆటలాడేది నాతోనా పోటియంటు గేలిచేసింది ఈకొమ్మకు ఆ కొమ్మకు గంతులేసింది ఎగురుకుంటు చివరనున్న కొమ్మ చేరింది పళ్ళన్నీ ఇకిలిస్తూ వెక్కిరించింది గెలవలేవు నన్నంటూ తోక ఊపింది. పట్టుపట్టి చెట్టెక్కి పైకి చేరాను కోతిపిల్లతో గెలిచి నేను వచ్చాను. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు