హరిణి హైద్రాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నది. అమ్మ హైమ నాన్న లీలారాజ్, తన ఆరవ ఏట నుంచి అక్కయ్య శ్రావణితో పాటు గురువుల వద్ద సంగీతం , చిత్రలేఖనంలో శిక్షణ ఆరంభించింది. తను గత ఐదు సంవత్సరాలుగా గురుకులం అకాడమీ లో సంగీతం అభ్యసిస్తున్నది. గురుకులంలో భక్తి , శ్రద్ధలతో విద్య నేర్పించే విధానం పిల్లలలో క్రమశిక్షణను అలవరుస్తుంది. అక్కడ విద్యార్థులను ప్రోత్సహిస్తూ నిర్వహించే పలు సంగీత కార్యక్రమాలలో, విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనటం తను ఇష్టపడుతుంది. హరిణికి బొమ్మలు వేయటం కూడా ఇష్టం. చిత్రలేఖనంలోని మెళకువలను సంభవ్ ఆర్ట్స్ అకాడమీ నందు ఆరేళ్లుగా నేర్చుకుంటున్నది. తమ పాఠశాలలో , తమ ఊరిలో నిర్వహించే బాలల చిత్రకళా ప్రదర్శనలకు పెయింటింగ్స్ పంపుతూవుంటుంది. చదువుతో పాటు సంగీతం , చిత్రలేఖనంలో నిర్వహించే ప్రాధమిక పరీక్షలలో ఉత్తీర్ణత పొందాలనే తన ఆకాంక్షకు అనుగుణంగా కృషి చేస్తున్నది.


కామెంట్‌లు