కుమారస్వామి ఆలయాలు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.---నిత్యం వేదనాదాలతో ప్రతిధ్వనిచే పుణ్యభూమి భారతదేశం .దక్షణ భారతంలో తమిళనాట కుమారస్వామి ఆలయాలు ఉండటంవిషేషం .ముక్కంటి తేజోపుంజ సంభూతుడు,ఆకాశమాత గంగ ఓడిజారి శరవణం(రెల్లుదిబ్బ)లో చేరి ఆరుగురు కృతికలచే ఆదరింపబడి, మనోహరంగా వెలసిన శ్రీసుబ్రహ్మణ్యం పేరున,ఆరురూపాలుగా వెలసి" షణ్మఖుడి" ఆరుమహిమాన్విత క్షేత్రాలలో వెలసి భక్తుల పూజలు అందుకుంటూ, కౌమారానికిచెందిన తనభక్తులను ఆదుకునే కార్తికేయుని ఆరు దేవాలయాలగురించి తెలుసు కుందాం!1)పళని.(దిండుక్కల్ జిల్లా) 2) స్వామిమలై(తంజావూరుజిల్లా) 3)తిరుచ్చందూ(తూత్తుకూడిజిల్లా)4)తిరుప్పురకుండ్రం(మధురైజిల్లా) 5)తిరత్తణి(తిరువళ్లురుజిల్లా) 6) పళముదిచోలై(తిరుచ్చిజిల్లా) వీటిని "షట్ క్షేత్రాలు"అంటారు.పళని:దాదాపు ఐదువందల అడుగుల ఎతైన"శివగిరి"పై బాలసుబ్రహ్మణ్యంగా స్వామి వెలసి ఉన్నాడు.అగస్త్యుని శిష్యుడైన"ఎడుంబన్"అనేరాక్షసుని తనగధతో స్వామి ఇక్కడే సంహరించాడు.అగస్త్యుడు స్వామిని వేడు కోగా శాంతించి,తనదర్శనానికివచ్చేవారు ముందుగా ఎడుంబన్ ను దర్శించుకునేలావరంఇచ్చాడు.మరోఇతిహాసంలో,బ్రహ్మఇచ్చిన జ్ఞానఫలాన్ని ఎవరుమొదటభూప్రదక్షణం చేసివస్తారో వారికే అన్నాడు శివుడు.వెంటనే తన నెమలివాహనంపై బయలుదేరాడు కుమారస్వామి. తనతల్లితండ్రికి ప్రదక్షణంచేసి జ్ఞానఫలం ఆరగించాడు గణపతి.అందుకు అలిగిన స్వామి శివగిరి పర్వతం చేరాడట.ఈస్వామిని"దండపాణి"అనికూడా అంటారు. తిరుచెందూర్:ఈఆలయం సముద్రతీరాన ఉంటుంది."తారకాసురుడు"అనే రాక్షసుని సంహరించేందుకు,కుమారస్వామిని దేవలోక సైన్యాధిపతినిచేసి యుధ్ధానికి పంపాడు శివుడు.సమస్తదేవతలు పార్వతిదేవి తమశక్తిని బల్లెంలో నింపి ఇచ్చారు స్వామికి.తారకాసురుని సంహరించగా అతని కంఠంలోని ఆత్మలింగం ఐదుభాగాలుగా పగిలి,"అమరరామం"-"క్షీరరామం"-"కుమారరామం"-"సోమరామం"-ద్రాక్షారామం"లపేరిట "పంచరామాలు"గావెలసాయి.దేవతలగురువు బృహస్పతి,ఇంద్రుడు ఈపంచరామాలను ప్రతిష్టించారు.తారకాసురునితమ్ముడు" శూరపద్ముడు "చెట్టుగామారడంలో స్వామి బల్లెంతో చెట్టును చీల్చగా ఒకభాగం నెమలిగా, మరోభాగం కోడిపుంజుగా మారి స్వామవాహనంగా మారాయి. తారకాసురుని వధ కార్తికశుధ్ధషష్ఠి రోజునజరిగింది.తమిళులు దీన్ని " స్కందషష్ఠి" అంటారు.కార్తికశుధ్ధపాడ్యమినుండి షష్ఠి వరకు జరిగే ఉత్సవాలకు దాదాపు ఇరవై లక్షలమంది భక్తులు పాల్గోంటారు.ఈదేవాలయంలో స్వామికి ఉదయం-సాయంత్రం విభూది అభిషేకంబరుగుతుంది. "తిరుప్పురకుండ్రం:మధరై కి చేరువలో ఉన్నగ్రామంఇది.దేవేంద్రునికుమార్తే"దేవసేన"ను ఇచ్చి ఇక్కడవివాహం జరిపించార నిస్ధల పురాణం ద్వారాతెలుస్తుంది.చిన్నకొండపై భాగాన అద్బుత శిలా సంపదతో విరాజిల్లుతుంది ఈదివ్యక్షేత్రం."తిరుత్తిణి":సముద్రమట్టానికి ఏడువందల మీటర్ల ఎత్తున కొండపై స్వామి ఇరువురు సతులతో కొలువై దర్శనం ఇస్తాడు.ప్రణవమంత్ర స్వామి బ్రహ్మకు ఇక్కడే బోధించాడట.అప్పుడు ఏర్పడిన పుష్కరిణినని నేడు"బ్రహ్మకుండం"అని అంటారు.వల్లిమలై అనేకొండపై"శ్రీవల్లి"అనేకన్యతపస్సు చేసి స్వామిని మెప్పించి వివాహం చేసుకుందట.ఇక్కడి వాగువద్ద నందీశ్వరుడు తపమాచరించినందున ఆవాగునునేటికి" నందివాగు" అంటారు.ఈఆలయంలో మాఘమాసంలో గోడకు ఉన్నరంధ్రం ద్వారామెదటిరోజుసూర్యకిరణాలు స్వామి పాదాలపైన,రెండోరోజు హృదయభాగంలో,మూడవ రోజు శిరస్సుపై ప్రసరింపబడతాయి.ఆడికృత్రిక స్వామివారి జన్మదినం.ఇదిజేష్ఠఆషాడమాసం లోవస్తుంది.ఆరోజు స్వామికి ఇష్టమైన చెంగల్వపూదండలతో కావడి అలంకరించుకుని వంటిపై పలుభాగాలలో శూలాలుగుచ్చుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.డిసెంబర్ 31న 365 మెట్లు ఎక్కిన లక్షలమందిభక్తులు స్వామిని దర్మించుకుంటారు. "స్వామిమలై:కుమారస్వామి మునిరూపంలో భూలోకవాసులకు ప్రణవమంత్రాన్ని ఇక్కడే బోధించాడట.స్వామిమలై అంటే,దేవుని కొండ అనిఅర్ధం.ఎత్తుగా ఉన్నగుట్టపై అరవై మెట్లుఎక్కితే గుడివస్తుంది. చోళరాజులనిర్మాణతకు ప్రతీకఈఆలయం. "పళముదిర్చోలై":ఈఆల యం మధురైదాపున రెండు కొండలనడుమ అడవిలో ఉంది.చిన్నదేవాలయం.ఇక్కడ సింహంతలరూపంలో చెక్కబడిన రాతినుండి నిరంతరం జలం ప్రవహిస్తుంది.స్వామి ఇక్కడ తపమా చరించాడట. "శరవణాభువుడు"-"దేవసేనాధిపతి"-"గుహుడు"-"ఆర్ముగం" -"షణ్ముగం"-"స్కందుడు"-"కార్తికేయుడు"-వంటిపలుపేర్లతో స్వామి పూజలందుకుంటున్నాడు. ధ్యాయే దిప్సిత సిధ్ధినం. శివ ఘతం.శ్రీద్వాదశాక్షం గుహం. ఖేటం కుక్కుట మంకుశంచ వరదం-పాశాంధనుశ్చక్రకం,వజ్రశక్తి మసించశూల మభయం.దోర్బర్దృతం. షణ్ముఖం.ధ్యాయేత్చిత్ర.మయూరవాహనశుభం.చిత్రాంబ.రాలంకృతమే" -


కామెంట్‌లు