మానేరు ముచ్చట్లు-రామ్మోహన్ రావు తుమ్మూరి. -మానేరు దగ్గర మొదలై మూసీ దగ్గరి దాకా వస్తానని మొదట్లో అనుకోలేదు.మన ఊరు అను కున్నట్లే మన జిల్లా,మన రాష్ట్రం ఇంకాస్తా ముందుకు పోతే మన దేశం అని భావించక పోతే మన అస్తిత్వానికి విలువ ఉండదు. ఇక విషయానికి వస్తే ఇవాళ, రేపటితో మానేరు ముచ్చట్లకు ముగిం పు చెప్పాలనుకుంటున్నాను.చదువు తుంటే చరిత్ర అగాధమనిపిస్తున్నది.పుస్తకం వేసినప్పుడు చివరలో నేను సంప్రదించిన పుస్తకాల వివరాలు ఇస్తాను.ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలు కావాలనుకునే వారికి అవి ఉపయోగ పడవచ్చు.అంతర్జాలం లో కూడా వెతికే మెళకువ ఓపిక ,ఉన్న వారికి కావలసినంత సమాచారం అందుబాటులో ఉంది.కాకపోతే ప్రామాణిక విషయంలో కొంత జాగ్రత్త అవసరం.గతంలో చెప్పినట్లు నైజాము పాలన తరువాత చేటు చేసుకున్న తెలంగాణా ప్రాంత రాజకీయ చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు కొన్ని స్పృశిస్తూ చారిత్రక సన్నివేశమైన తెలంగాణా ఆవిర్భావంతో ముగించాలనుకున్న దానిలో మిగిలినవి రెండు సందర్భాలు.ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ రెండు తెలంగాణ ఆవిర్భావం.కనుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి కారణాలు సందర్భాలు తెలుసుకుందాం.1952 లో హైదరాబాదు రాష్ట్రంలో తొలిసారి ప్రజాస్వామిక ఎన్నికలు జరిగే నాటికి,అది గతంలో నైజాము రాష్ట్రంగా ఉన్నప్పుడున్న జిల్లాలనే కలిగి ఉన్నది.నైసర్గికంగా అవి నాలుగు డివిజన్లుగా పదహారు జిల్లాలుగా విభజింపబడి ఉన్నవి.అవి a)ఔరంగాబాదు డివిజన్ లోని 1.ఔరంగాబాదు జిల్లా,2.బీడ్ జిల్లా,3.నాందేడ్ జిల్లా,4.పర్భని జిల్లా b)గుల్బర్గా డివిజన్ లోని 5.బీదరు జిల్లా,6.గుల్బర్గా జిల్లా,7.ఉస్మానాబాద్ జిల్లా,8.రాయచూర్ జిల్లాc)గుల్షనాబాద్(మెదక్) డివిజన్ లోని 9.అత్రాఫ్ ఇ బల్దియ (హైదరాబాద్ ) 10.మహెబూబ్ నగర్ జిల్లా,11.మెదక్ జిల్లా,12.నల్గొండ జిల్లా, 13.నిజామాబాద్ జిల్లాd)వరంగల్ డివిజన్ లోని 14.ఆదిలాబాద్ జిల్లా,15.కరీంనగర్ జిల్లా,16.వరంగల్ జిల్లాలుఆంధ్ర రాష్ట్రసాధన ధ్యేయంగా 1913లో ఆంధ్ర మహాసభ ఏర్పడి బాపట్లలో తొలి సమావేశం జరిపింది.అప్పటికి భారతదేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ దేశమంతటా సభలు నిర్వహిస్తూ వాటిలో స్థానిక సమస్యల చర్చలు కూడా జరిపేవారు.1947 లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన కాంగ్రెసు పార్టీ సమావేశంలో భాషారాష్ట్రాల సమస్య చర్చకు వచ్చింది.అనేక రాజకీయ పరిణామాల అనంతరం పెట్టి శ్రీరాములు 59రోజులు ఆమరణ దీక్ష వహించి అసువులు బాసిన తరువాతగానీ ఆంధ్రరాష్ట్రం ఏర్పడలేదు.అలా 1953 నవంబరు 1న ఏర్పడ్డ ఆంధ్ర రాష్టానికి తొలిముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు.తొలి రాజధాని కర్నూలు. అలామద్రాసు రాష్ట్రం నుండి విడివడి ఏర్పడిన ఆంధ్రరాష్టం మూడు ప్రాంతాలలోని జిల్లాలు ఇవి a)ఉత్తరాంధ్ర ప్రాంతం లో1.శ్రీకాకుళం,2.విజయనగరం,3.విశాఖపట్నం b)తీరాంధ్ర ప్రాంతం లో 4.తూర్పు గోదావరి,5.పశ్చిమ గోదావరి,6.క్రిష్ణా 7.గుంటూరు,8.ప్రకాశం,9.నెల్లూరు c)రాయలసీమ ప్రాంతంలో 10.చిత్తూరు, 11.కడప,12.అనంత పూర్,13.కర్నూలు జిల్లాలుండేవి. 1954 లో రాష్ట్రాల పునర్వ్యవ స్థీకరణ సంఘం (S.R.C.) ఫజల్ అలీ అధ్యక్షతన ఏర్పడింది. S.R.C. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించక తప్పదని తేల్చి చెప్పింది.హైదరాబాద్ ప్రదేశ్ కమిటీ ఫజల్అలీ కమిటీకి ఒక నివేదిక ఇచ్చింది.తెలంగాణ తొమ్మిది జిల్లాలు,చాలదా,బస్తర్ లోని కొన్ని ప్రాంతాలు,భద్రాచలం తాలూకా లోని కొంత ప్రాంతం కలిపి హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పరచమని దాని సారాంశం.కమ్యూనిస్టులంతా విశాలాంధ్ర వాదులే.ఫజలలీ కమిషన్ బీదరును కలుపు కొని హైదరాబాద్ స్టేట్ గా విభజించాలని సూచించింది. విశాలాంధ్ర కూడా సబబైనదే కాని హైదరాబాదు రాష్ట్రమేర్పడి ఎన్నికలు జరిగిన తరువాత ఎంపికైన శాసనసభ్యులలో మూడింట రెండువంతులు సమ్మతిస్తే అప్పుడు విశాలాంధ్ర ఏర్పరచవచ్చునని సూచించింది .బూర్గుల మంత్రి వర్గములో ఎక్కువ మంది విశాలాంధ్రవాదులే.బూర్గుల మొదట్లో తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సుముఖంగానే ఉన్నా ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత మారిపోయారని మర్రి చెన్నారెడ్డి వాదన.కే.వి.రంగారెడ్డి తెలంగాణ స్వయం సమృద్ధం గనకవిశాలాంధ్ర అవసరం లేదనే అన్నారు. కేంద్రంలో గోవింద వల్లభ్ పంత్ విశాలాంధ్ర నిర్మాణం కోసం బూర్గులను అనునయించారని కూడా అనుకోవటం జరిగింది. ఏదైతేనేం భాషాప్రయుక్త రాష్ట్రంగా విశాలాంధ్ర నిర్మాణానికి దారి సుగమమయ్యింది.అయితే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగకుండా ఇరు ప్రాంతాల నాయకులందరు కలిసి ఒక ఒప్పందంపై సంతకం చేశారు దాని పేరేపెద్దమనుషులఒప్పందం’ (Gentleman Agreement). 14 అంశాలతో కూడిన ఈ ఒప్పందం పైఆంధ్ర ప్రాంతంనుండి బెజవాడ గోపాల్ రెడ్డి , నీలం సంజీవ్ రెడ్డి, అల్లూరి సత్య నారాయణ రాజు,గౌతు లచ్చన్న లు తెలంగాణ నుండి బూర్గుల రామకృష్ణారావు,కొండా వెంకట రంగారెడ్డి,దే.వి. నర్సింగ రావు,మర్రి చెన్నారెడ్డి లు సొమతకాలు చేఒశారు.అదులో ముఖ్యంగా పరిపాలనా వ్యయం ఇరు ప్రాంతాల నిష్పత్తి ప్రకారం జరగాలి.తెలంగాణా మిగులు నిధులు కొంతకాలం పాటు తెలంగాణాకే ఉపయోగించబడాలి.మద్య నిషేధం తెలంగాణ శాసన సభ్యుల అనుమోదం ఉంటే జరగాలికీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు తెలంగాణ సర్వతో ముఖాభి వృద్ధికి ఏర్పడిన ప్రాంతీయ సంఘం సలహాలు పాటించాలి.ఉద్యోగ నియామకాలు ఉభయ ప్రాంతాల జనాభా ప్రతిపదికన జరగాలి.తెలంగాణా ఉన్నత విద్యా సౌకర్యాలు తెలంగాణ వారికే లభించాలి.వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ సంఘం అధీనంలో ఉండాలి.మంత్రి వర్గంలో 60శాతం ఆంధ్ర,40శాతం తెలంగాణ వారుండాలి.ముఖ్యమంత్రి,ఉపముఖ్యమంత్రి ఒకరు అటు వారైతే ఒకరు ఇటు వారుండాలి.ఇలా ఈ ఒప్పందం జరిగిన తరువాత 1956 నవంబరు ఒకటవ తేదీన అప్పటి దేశ ప్రధానమ జవాహర్ లాల్ నెహ్రూఆంధ్రప్రదేశ్ ను హైదరాబాదు రాజధానిగా ప్రారంభోత్సవం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కు ప్రముఖ స్థానం ఉండాలని ప్రధాని తన ప్రసంగంలో అన్నారు.అనేక తర్జన భర్జనల తరువాత ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అయ్యాడు.ఆదర్శాలు ఆదర్శాలే. రాజకీయం రాజకీయమే.ఇది అప్పుడైన ఇప్పుడైనా ఎప్పుడైనాఅక్షర సత్యం.రాజకీయ చదరంగం గురించి రాయాలంటే గ్రంథాలు సరిపోవు.ఏదైతేనేం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఒక చారిత్రక సంఘటన గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణా ప్రాంత ప్రజల కలయికతో ఏర్పడింది.(సశేషం)


కామెంట్‌లు