కేసీఆర్ ...తెలంగాణ జాతిపిత: జాన్ రెడ్డి తాటి -జర్నలిస్టుగా అనేకానేక సందర్భాల్లో మద్దతు పలికిన...తెలంగాణ బిడ్డగా బరి గీసి నిలబడిన. వృత్తి జీవితాన్ని, వ్యక్తి గత జీవితాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా...తెలంగాణ చుట్టే నా జీవితం ముడిపడి ఉంది. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతు బిడ్డనే అయినా...నీరందని లిఫ్ట్ భూములున్న వాడిని. సాగర్ ప్రాజెక్టులో కనీస నీటి మట్టం నిల్వలు మెయింటైన్ చేయని వైనాన్ని చూసిన వాడిని. చంద్ర గ్రహణ పాలనలో....అతి తక్కువ నోటిఫికేషన్లు చూసిన తరానికి ప్రతినిధిని. చదివిన చదువు ఉద్యోగం దొరక్క...ఊరెళ్లి వ్యవసాయం చేయలేక....నిత్య సంఘర్షణలు పడిన ఎందరో యువకుల్లో నేను కూడా ఒకడిని. తెలంగాణ ఏర్పడ ముందుకు ఊరెళ్లడానికి బస్సుల్లో...రైళ్లలో వివిక్ష ఎదుర్కొన్న మా ప్రాంత వారిలో నేనూ ఒక్కడిని.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా, జర్నలిస్టుగా, టీఆర్ ఎస్ కు మద్దతు పలికిన ఈ ప్రాంత వాసిగా....తెలంగాణ చుట్టే నా జీవితం సాగింది. జాతీయవాద విద్యార్థి విభాగంలో కొనసాగిన నేను....కాకినాడ తీర్మానానికి కట్టుబడలేదంటూ....తెలంగాణకు జై కొట్టిన. నాటి నుంచి నేటి వరకు జై తెలంగాణ అన్న. తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్మ ప్రతి ఒక్కరికీ మద్దతు పలికిన. తెలంగాణ కోసం మాజీ మంత్రి ఇంద్రారెడ్డి ఓ యాత్ర తీసిండు. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్న. మా సొంత ఊర్లో నేను మరికొంత మంది సపోర్ట్ చేసినం. ఆ తర్వాత కేసీఆరే ఇ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నడు. తెలంగాణ సాయుధ పోరాట గాథను చరిత్రలో చదువుకున్న. 1969 మలిదశ తెలంగాణ పోరాటం గురించి చదువుకున్న, నాటి తరం ప్రతినిధులను కలిసి తెలుసుకున్న. మా నాయిన గూడ విద్యార్థి దశలో జై తెలంగాణ అన్నడంట. పల్లెటూరులో ఉన్నగద అంతకు ఎక్కువ తెల్వదన్నడు... వర్సిటీ విద్యార్థి దశ నుంచి ఈ తెలంగాణ పోరాటం చూసినోడిని. విద్యార్థి ఉద్యమంలో పాలు పంచుకున్నోడిని, జర్నలిస్టుగా అనేక అంశాలు రిపోర్ట్ చేసినోడిని, తెలంగాణవాదానికి ఎత్తుకొని సంకలనాలు వెలువరించిన అనేకమందికి వ్యాసాలు పంపిన వాడిని. సాగర్ ఆయకట్టు లిఫ్ట్ రైతుల కోసం కేసీ ఆర్ నల్లగొండలో జిల్లాలో పాదయాత్ర చేసినప్ఫుడు ఓ కథనమే రాసినోడిని...‌ప్రత్యక్షంగానో... పరోక్షంగానో తెలంగాణ చుట్టే నా జీవితం ముడి పడింది. తెలంగాణ వచ్చినప్పుడు అందరి లెక్క నేను సంతోషించిన. మా రాష్ట్రం మాకొచ్చింది అనుకున్న... డైరెక్ట్ గా మా తెలంగాణ నేను ఏమి డైరెక్ట్ లబ్ధి పొందలె. ఇనేళ్ల తర్వాత రైతు బంధు ద్వారా లబ్ది పొందిన నేను ఆ ఫీల్ తో ఏదైనా రాయాలని నా మనసుల ఉండె. ఆఫలాలు అందుకున్న. అందుకే మనసుల ఉన్నది దిల్ దార్ గా రాస్తున్న.. చివరగా.. కేసీఆర్ ను గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నవ్ అని యూనివర్సిటీ మిత్రులు, జర్నలిస్టు మిత్రులు ఇరవై ఏళ్ల కెళ్లి నన్ను సతాయిస్తున్నర్. అయినా నేను ఫీల్ కాలే. కేసీ అర్ లేకుంటే తెలంగాణ అచ్చేదా... గుండె మీద చేయేసుకోని చెప్పండి... మీరేమైనా అనుకోండి. కేసీఆర్ తెలంగాణ జాతిపిత.


కామెంట్‌లు