పది ఫలితాలంటె ఎంత టెన్షనో అప్పుడు...--తొమ్మిదో తరగతి వరకు... ప్రైవేట్ స్కూల్ (మధ్య లో ఓ రెండేళ్లు మినహా) ప్రైవేట్లో అంటే చదువు...చదువు... స్డడీ అవర్లు...ఎక్స్ ట్రా క్లాసులు. ఒక విధంగా చదువంటేనే విరక్తి వచ్చింది. ఇక ఈ స్కూల్ లో టెన్త్ చదవొద్దని మెంటల్ గా ఫిక్స్ అయ్యా. తొమ్మిదో తరగతి పరీక్ష గవర్మమెంట్ స్కూల్ లో రాయాలని తెచ్చిన ఒత్తడి ఫలితంగా... త్రిపురారంలో చదివిన మేం పెద్దవూర పరీక్ష రాశాం. ఫలితాల అనంతరం ఓ ఐదుగురం మేం చదివిన ఆ ప్రైవేట్ స్కూల్ కు టాటా చెప్పాం. తలా ఓ దిక్కుకు చెల్లాచెదురైనం ఓ ఇద్దరం త్రిపురారం జెడ్పీహెచ్ ఎస్ లో చేరిపోయాం. అప్పటి వరకు పంజరంలో చిలుకలా ఉన్న నాకు... సర్కారు బడిలో చేరే సరికి అపరిమితమైన స్వేచ్ఛ వచ్చినట్టయ్యింది. చదవాలనే ఒత్తిడి, నిర్భంధమేమీ లేదు. ఆటపాటలతోనే ఏం చదివానో ఏం చేసేనో తెలియకుండానే సంక్రాంతి సెలవులు అయిపోయాయి. పరీక్షలు దగ్గర పడే కొద్ది కడుపులో భయం జొరబడింది. ఎందుకో బాగా చదువుకోవాలని అనుకున్నా. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవుగా. ఫిబ్రవరి మొదటి మాసంలోకి వచ్చే సరికి అమ్మ తల్లి {,పెద్దతల్లి) పోసింది. ముందూవెనకా...కనీస ఎటువైపు కూడా పడుకోలేని అవస్థ. చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నా. పరీక్షలకు సమయం దగ్గర పడినా కొద్దీ నాలో టెన్షన్ మొదలైంది. ఏ రోజుకారోజు‌ అగ్ని పరీక్ష లాగే. ఎగ్జామ్స్ అయితే రాశా. పాసవుతానన్న గ్యారంటీ లేదు. సంవత్సరం వేస్టే అని ఫిక్స్ అయ్యా. రిజల్ట్స్ అనగానే టెన్షన్. సరిగ్గా చదవని నాకే అంతగానే ఉంటే చదివిన వారికి ఎంత ఉందో... అనుకున్నా. అప్పట్లో...‌పేపర్లు ఫలితాలకు సాయంకాలం ఎడిషన్లు కూడా ఇచ్చేవి. మిర్యాలగూడ నుంచి ఎవరో ఒకరు పేపర్ తెచ్చారు. భయంభయంగానే నా నంబరు చెప్పాను. ఫస్ట్ క్లాస్ లో వద్దులే థర్డో...సెకండో చూడు అన్నాను. మొత్తానికి మ్యాథ్స్, సైన్స్, హిందీ సబ్జెక్ట్ లలో బార్డర్ మార్కులతో పాసయ్యా. 1992లో మా టెన్త్ క్లాస్ మొత్తం 114. కేవలం 24 మందివి పాసయ్యాం--ఎందుకో గానీ ఇంటర్ లో చేరే సరికి చదువుకోవాలనే కసి బాగా పెరిగింది. డిగ్రీ... అఫై మూడు యూనివర్సిటీ ల్లో చదివా.. ఎక్కడా వెనుదిరిగి చూడలె.---చివరగా... మా అబ్బాయి. టెన్త్ పూర్తయింది..10/10- జాన్ రెడ్డి తాటి


కామెంట్‌లు