మంచి మనసు( బాలగేయం ):-రచయిత : పుట్టగుంట సురేష్ కుమార్ వెన్నకుంది మంచి మనసు తాను కరిగి నేతినిచ్చు ! కొవ్వొత్తిది మంచి మనసు తాను కరిగి కాంతినిచ్చు ! మేఘానిది మంచి మనసు తాను కరిగి వాననిచ్చు ! వృక్షానిది మంచి మనసు నరికినా కట్టెలనిచ్చు ! మనిషికుంది నలుపు మనసు దాని వలన చీకటొచ్చు ! మారాలీ మనిషి మనసు మారినచో వెలుగు వచ్చు !!


కామెంట్‌లు