దొంగలగస్తి. (బేతాళకథ (4) - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర్ రావు : పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజానవేసుకుని మౌనంగా నడవ సాగాడు.శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు 'రాజా విక్రమార్క నీవు రమ్యక, రుమళిక, ద్వారక,సింహాళ,కైవల్య, మలయ,అశ్వభద్ర,కేతు,గోభి,మాల్యవంత,పుష్కర,వృషభ, రైవత,నిమ్నొచన, నియోమ్యమ ,పారవారా,చౌరవశ్రిత,మాల్యద్రి వంటి ప్రాంతాలలో పేరు పోందిన నీనుండి చాలా విషయాలు తెలుసుకొవాలి. నాకు చాలాకాలంగా ఉన్న సందేహం నీకు దొంగలగస్తి అనే కథారూపంగా నీకు ప్రయాణ అలసట తెలియకుండా చెపుతానువిను...అమరావతి రాజ్యాన్ని చంద్రసే నుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు,అతని రాజ్య శివార్లలోని గ్రామాలలో తరచు దొంగతనాలు జరగడంతో అక్కడి ప్రజలు మహరాజు ను కలసి తమ బాధలు విన్నవించారు. మహరాజు ఎందరి భటులను వినియోగించినా,అక్కడ జరిగే దొంగతనాలు ఆపలేకపోయాడు. ఒకరోజు శివయ్య అనేయువకుడు రాజు గారిని కలసి 'మహరాజా మనరాజ్య శివారు ప్రాంతాలలో జరిగే దొంగతనాలు అరికట్టడానికి నావద్ద ఒక ఉపాయం ఉంది' అని దాన్నివివరించాడు.మరుదినం,ఆశివారు గ్రామ ప్రాంతాలలో దండోరావేస్తు, 'ఇందుమూలంగా తెలియజేయ డమేమనగా దొంగతనం చేస్తూ దొరికినవారితోపాటు వారి కుటుంబ సభ్యులు,బంధువులు ,మిత్రులు అందరికి మరణశిక్ష విధించ బడుతుంది.దొంగతనానికి పాల్పడేవారు తనతోపాటు తనవారందరిని కోల్పోతాడు. కనుక ఈశిక్షి నుండి తప్పించుకోవాలి అంటే వచ్చే పౌర్ణమి నాడు రాజసభలో గతంలో దొంగతనాలు చేసినవారు లొంగిపోతే, వారికి క్షమాభిక్ష పెడుతూ రాజుగారు రాజభటుల ఉద్యోగం యిస్తారు.అలా వారి ఊరిలోనే రాత్రులు కావలి కాసే బాధ్యత వారికి అప్పగింపబడుతుందహా....'అని ప్రకటించారు.అదివిన్నప్రజలు దొంలగస్తి ఏమిటి అని ఆశ్చర్యపోయారు.దొంగతనం చేసే వారి కుటుంబ సభ్యులంతా మీరు దొంగతనం చేస్తూ పట్టు బడితే మాఅందరి ప్రాణాలు పోతాయి .కనుక మీరు పౌర్ణమిరోజు రాజు గారి ఎదుట లొంగిపోయి, వారు యిచ్చే రాజభటుని ఉద్యోగం స్వీకరించి, హాయిగా దర్జాగా ఠీవిగా బ్రతకవచ్చు.ఇలా దొంగతనం చేస్తూ అనుక్షణం భయంతో జీవించడం నరకంగా ఉంటుంది' అనిపొరుపెట్టారు. చేసేదిలేక కుటుంబసభ్యుల వత్తిడితో,దొంగలు అందరు రాజుగారి సభలో పౌర్ణమిరోజు లొంగిపోయారు.అలా లొంగిపోయిన దొంగలు అందరికి చెరసాల శిక్ష విధించిన రాజు, వారికుటుంబంలో ఒకరికి వారి అర్హతను బట్టి ఉద్యోగం యిచ్చాడు.కథ చెప్పడం ఆపిన బేతాళుడు...'రాజా విక్రమార్క చంద్రసేన మహరాజు ఆడినమాటతప్పి,లొంగిపోయిన దొంగలను చెరసాలలో బంధించాడు. చెప్పినదానికి విరుధ్ధంగా దొంగల కుటుంబ సభ్యులకు రాజ ఉద్యోగాలు ఇచ్చాడు,ఆ ఉద్యోగమేదో లొంగిపోయిన దొంగలకే ఇవ్వచ్చుకదా! ఈనాప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు'అన్నాడుబేతాళా చంద్రసేన మహారాజు ఎంతోముందు చూపు కలిగినవాడు.తన ప్రకటన ప్రకారం దొంగలను క్షమించి వారందరికి ఉద్యోగాలు ఇస్తే ,అదిచూసి ముందుకాలంలో మరెందరో దొంగలుగా మారే అవకాశం ఉంది.మనం రక్షణకోసం ఏర్పాటు చేసుకున్న చట్టాన్ని ఎప్పుడూ మనం గౌరవించాలి. ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే.తప్పుచేసిన వారిని తన పర బేధం లేకుండా శిక్షించాలి,అలా శిక్ష అనుభవించి, పశ్చాతాప పడి, మార్పుచెందుతారు. చంద్రసేనరాజు, దొంగల కుటుంబ సభ్యులలో అర్హత కలిగిన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కలిగించి ఆకుటుంబాన్ని ఆదుకున్నాడు. అలా తప్పుచేసిన దొంగలకు శిక్షవిధించి ,తప్పుడు పనులకు పాల్పడే వారిని పరోక్షంగా హెచ్చరించాడు.ఇలా చంద్రసేనుడు తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదే' అన్నాడు.విక్రమార్కుడు. విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహ బేతాళుడు అదృశ్యమైయ్యడు.పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు మరలా వెనుతిరిగాడు.(కల్పితం)
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి